AP Rythu Bharosa vs Annadata Sukhibhava: ఏపీ రైతులకు గుడ్ న్యూస్. వారికి ఒకేరోజు రెండు పథకాలు అమలు కానున్నాయి. ఒకేసారి బ్యాంకులో నిధులు జమ కానున్నాయి. కేంద్రం అందించే పీఎం కిసాన్ తో( pm Kisan) పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ సైతం రైతుల ఖాతాల్లో పడనుంది. ప్రతి రైతుకు సాగు సాయం కింద 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ పథకాల్లో సైతం దీనిని చేర్చారు. అందులో భాగంగా ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. కేంద్రం అందించే పీఎం కిసాన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం మొదటి విడత సాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా తొలి విడత నిధుల జమకు అర్హుల జాబితా పై తుదికసరత్తు జరుగుతుంది. పిఎం కిసాన్ నిధులు వచ్చేవారం విడుదల చేయనుండడంతో వాటితో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు జమ చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
గత కొన్నేళ్లుగా కేంద్రం సాయం..
గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పేరిట రైతులకు నగదు సాయం చేస్తూ వచ్చింది. ఏడాదికి 6 వేల రూపాయలను మూడు విడతల్లో అందిస్తూ వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా పేరిట పిఎం కిసాన్ తో పాటు మూడు విడతల్లో సాయం అందుతూ వచ్చింది. అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభవ కూడా మూడు విడతల్లో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అందించే 6000 రూపాయలకు తోడు రాష్ట్ర ప్రభుత్వపరంగా 14000 అందించేందుకు నిర్ణయించారు. మొదట ఈనెల 20న పథకం ప్రారంభిస్తారని అంతా భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చేవారం ఈ పథకం అమలు దిశగా నిర్ణయించింది. దీంతో ఏపీ ప్రభుత్వం సైతం రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులను అప్పుడే జమ చేయనుంది. అయితే ఇప్పటికే అర్హుల జాబితాను రూపొందించారు. ప్రభుత్వం జిల్లాలనుంచి సమాచారం కూడా సహకరిస్తుంది.
Also Read: Annadata Sukhibhava Scheme: చంద్రబాబు వచ్చేశాడు.. మార్చేశాడు
లక్ష మందికి పైగా ఈ కేవైసీ పెండింగ్
ఇప్పటివరకు రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) పథకానికి 45, 64,005 మంది రైతులు అర్హత సాధించినట్లు తెలిసింది. ఇందులో 40 నాలుగు లక్షల మందికి పైగా రైతులు ఈ కేవైసీ పూర్తి చేశారు. ఇంకా 1,20,000 మందికి పైగా రైతులు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. 2024 జనవరిలో 53.58 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా పేరిట అప్పట్లో నిధులు జమ చేశారు. అయితే అప్పటితో పోలిస్తే దాదాపు 8 లక్షల మంది లబ్ధిదారులు తగ్గారు. సాంకేతిక సమస్యలతో పాటు రెవెన్యూ చిక్కులు ఎదురు కావడంతోనే వీరంతా అనర్హుల జాబితాలో ఉన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన భూ సమగ్ర సర్వేలో సైతం అనేక భూ సమస్యలు తలెత్తాయి. ఇవి ప్రస్తుతం పరిష్కారం కాలేదు. అయితే సాంకేతిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా? పథకం అమలు చేస్తుందా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
Also Read: Rythu Bharosa: ఖాతాల్లోకి డబ్బులు.. రైతులకు భరోసా
రైతు సేవా కేంద్రాలకు జాబితా..
అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను ఇప్పటికే రైతు సేవా కేంద్రాలకు పంపించారు. దీంతో అర్హుల గుర్తింపు చాలా సులువు అయింది. వివరాలు లేని వారు మాత్రమే బయోమెట్రిక్( biometric) నమోదు చేసుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు. మరోవైపు http://annadathasukhibhava.ap.gov.in లోకి వెళ్లి రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కల్పించారు. రైతులు తమ ఆధార్ నెంబర్ నమోదు చేసి.. పక్కనే ఉండే కప్చాను ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే అర్హుల వివరాలు కనిపిస్తాయి. అదే సమయంలో ఈ కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో? లేదో కూడా తెలుస్తుంది. జాబితాలో పేరు లేకుంటే రైతు సేవా కేంద్రంలో సంప్రదించడం ద్వారా స్పష్టత రానుంది.