Trump Iran Pakistan Strategy: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ఎవరిని శత్రువుగా భావిస్తారు.. ఎవరిని మిత్రుడిగా భావిస్తారు.. అనేది అంతు చిక్కడం లేదు. ఇటీవల పాకిస్తాను ప్రేమిస్తున్నానని ప్రకటించారు. కానీ ఇది కపట ప్రేమలా కనిపిస్తోంది. ఇరాన్–ఇజ్రాయెల్ వార్ సమయంలో ట్రంప్ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.
పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరింది. రిపబ్లిక్ ఆఫ్ ఇస్తామిక్ కంట్రీ అయిన ఇరాన్‌ను అమెరికా.. మరో రిపబ్లిక్ ఇస్లామిక్ కంట్రీ అయిన పాకిస్తాన్ సహాయంతో దెబ్బకొట్టాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ఇంతకాలం ఇరాన్‌కు మద్దతు ఇచ్చిన పాకిస్తాన్‌ను ఆ దేశానికి దూరం చేయడానికే పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నట్లు ప్రకటించారని తెలుస్తోంది.
పాకిస్తాన్ ఒక పావుగా?
ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్‌ను విందుకు ఆహ్వానించడం ద్వారా పాకిస్తాన్‌తో సన్నిహిత సంబంధాలను సూచిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అయితే, ఈ ఆహ్వానం వెనుక ఉద్దేశం ఇరాన్‌పై సైనిక దాడికి పాకిస్తాన్ గడ్డను బేస్‌గా ఉపయోగించేందుకు అమెరికా సిద్ధమవుతోందని ఆరోపిస్తోంది. పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దు వద్ద ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ (ELINT) సేకరణ కోసం జెట్‌లను ఉపయోగిస్తూ అమెరికాకు సహాయం చేస్తోందని సమాచాం. ఇది జరిగితే, ఇరాన్‌తో పాకిస్తాన్ సంబంధాలు శత్రుత్వంగా మారే ప్రమాదం ఉందని, ఇది పాకిస్తాన్‌ను దీర్ఘకాలంలో రాజకీయ, భౌగోళిక రాజకీయ సంక్షోభంలోకి నెట్టవచ్చు.
పాకిస్తాన్–ఇరాన్ సంబంధాలు..
పాకిస్తాన్ – ఇరాన్ మధ్య సంబంధాలు చారిత్రకంగా సంక్లిష్టంగా ఉన్నాయి. రెండు దేశాలూ ముస్లిం దేశాలైనప్పటికీ, షియా–సున్నీ విభేదాలు, అమెరికా, సౌదీ అరేబియాతో పాకిస్తాన్ యొక్క సంబంధాలు, ఇరాన్ అమెరికా–వ్యతిరేక ధోరణి ఈ సంబంధాలను ప్రభావితం చేశాయి. 2024లో ఇరాన్ బలూచిస్తాన్‌లో దాడులు చేసిన సంఘటన రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను సూచిస్తుంది. అయితే, పాకిస్తాన్ ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్ దాడులను ఖండించింది. ఈ వైరుధ్యం పాకిస్తాన్ రాజకీయ నిర్ణయాలలోని సంక్లిష్టతను హైలైట్ చేస్తుంది.
Also Read: Trump Pressured India: ట్రంప్ డిమాండ్లకు నో చెప్పిన భారత్.. సంచలనం
ట్రంప్ ద్వంద్వ రాజనీతి..
ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘బెస్ట్ ఫ్రెండ్‘గా పిలుస్తూనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను విందుకు ఆహ్వానించడం భారత్‌లో ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే, ట్రంప్ ఈ చర్యలు అమెరికా భౌగోళిక రాజకీయ లక్ష్యాల కోసం రెండు దేశాలనూ వేర్వేరు రీతిలో ఉపయోగించే వ్యూహంగా చూడవచ్చు. మోదీ ట్రంప్ యొక్క వైట్ హౌస్ ఆహ్వానాన్ని తిరస్కరించడం, కానీ క్వాడ్ సమావేశానికి ట్రంప్ భారత్‌కు రానుండటం, భారత్ రాజకీయ స్వాతంత్య్రాన్ని, జాగ్రత్తను సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా, పాకిస్తాన్ ట్రంప్ ఆహ్వానాన్ని స్వీకరించడం దాని ఆర్థిక, సైనిక ఆధారపడటం అమెరికాతో సహకారానికి దారితీస్తుందని సూచిస్తుంది.
భారత్, ప్రపంచ స్పందన
భారత్‌లో ట్రంప్ ఈ చర్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ముఖ్యంగా మోదీని ‘బెస్ట్ ఫ్రెండ్‘గా పిలిచిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ఆహ్వానించడం వివాదాస్పదంగా మారింది. భారత్ యొక్క రాజకీయ స్వాతంత్య్రం, క్వాడ్ సమావేశంలో దాని కీలక పాత్ర ట్రంప్ యొక్క వ్యూహంలో భారత్‌ను ప్రధాన భాగస్వామిగా చూపిస్తుంది, అయితే పాకిస్తాన్‌ను కేవలం సైనిక వ్యూహంలో ఒక సాధనంగా ఉపయోగించే అవకాశం ఉంది. ఇది ఇరాన్‌కు ప్రాణసంకటంగా మారే అవకాశం ఉంది.