Rythu Bharosa: తెలంగాణ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌ను మించి పంటులు పండుతున్నాయి. దీనికితోడు 2018లో కేసీఆర్ తీసుకువచ్చిన రైతుబంధు పథకం అన్నదాతకు అండగా నిలిచింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానిని కొనసాగిస్తోంది. గత ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు ఇవ్వగా, ప్రస్తుతం రేవంత్ సర్కార్ రూ.12 వేలు ఇస్తోంది.
Also Read: ఒకే ఓవర్లో ఐదు వికెట్లు.. దిగ్వేష్ రాటి పెను సంచలనం.. లక్నో ఓనర్ ఏం చేశాడంటే?
రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వర్షాకాలం పంటల సాగు మొదలైంది. ఇప్పటికే రైతులు పత్తి, సోయా పంటలు విత్తుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలం సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
తొలి విడతలో 41.25 లక్షల మందికి..
మొదటి దశలో, ఒక ఎకరం కంటే తక్కువ భూమి కలిగిన 24.22 లక్షల మంది రైతులు, రెండు ఎకరాల భూమి కలిగిన 17.02 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయబడ్డాయి. మొత్తం 41.25 లక్షల మంది రైతులకు రూ.2,349.83 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
9 రోజుల్లో 70.11 లక్షల మందికి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే తొమ్మిది రోజుల్లో 70.11 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చర్య రైతులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించడంతో పాటు వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి దోహదపడనుంది.
రైతు సంక్షేమానికి కట్టుబడి..
రైతుభరోసా పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నిధుల జమ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉంది.