AP Police constable : ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ( police constable)ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తయ్యాయి. కానీ తుది రాత పరీక్ష మాత్రం మిగిలి ఉంది. దీంతో ఈ పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం తేదీలను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఐదు పరీక్ష కేంద్రాలను వీటి కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. కానీ సకాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేయడంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. దానిని పూర్తిచేసే బాధ్యతలు తీసుకున్న కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై పావులు కదపడం ప్రారంభించింది. వీలైనంత త్వరగా ఈ నియామకాలను పూర్తి చేయాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. తాజాగా రాత పరీక్షకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read : సతీ సమేతంగా ఢిల్లీకి చంద్రబాబు.. కారణం అదే!
* జూన్ 1న పరీక్ష..
కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం తుది రాత పరీక్ష జూన్ 1 నిర్వహించాలని ప్రభుత్వం( AP government ) నిర్ణయించింది. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 38,910 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు తమ సమీప నగరంలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేసుకున్న అభ్యర్థులు తుది రాత పరీక్ష కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తేదీని ఖరారు చేయడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
* రెండేళ్ల కిందట నోటిఫికేషన్..
ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2023 జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష( preliminary exam) నిర్వహించారు. దాదాపు నాలుగు లక్షల అరవై వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 95,208 మంది క్వాలిఫై అయ్యారు. వీరికి గత ఏడాది డిసెంబర్ 30న ఫిజికల్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో 38,910 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరికి ఇప్పుడు జూన్ 1న తుది రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. వివరాల కోసం అభ్యర్థులు http://slprb.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి చూడవచ్చు. ఈ వెబ్సైట్లోనే ఫైనల్ గా ఎంపికైన అభ్యర్థుల వివరాలు కూడా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తానికైతే కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి రాత పరీక్ష తేదీ ఖరారు కావడంతో అభ్యర్థుల్లో ఒక రకమైన ఆనందం వ్యక్తం అవుతుంది.
Also Read : భారత్ విషాదంలో ఉంటే ఢిల్లీపాక్ హైకమిషన్ లో కేక్ కటింగ్ నా?