CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ తో సమావేశమై అమరావతి రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య విషయాలపై కూడా చర్చిస్తారు. అంతకుముందు సచివాలయంలో అధికారుల వర్క్ షాప్ లో చంద్రబాబు పాల్గొన్నారు. కాగా శుక్రవారం ఢిల్లీకి బయలుదేరనున్నారు చంద్రబాబు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. మే 2 న అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని ఆహ్వానించునున్నారు. ఈ సందర్భంగా అమరావతి తో పాటు ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే వీటిపై చంద్రబాబు సూత్రప్రాయంగా గత పర్యటనలోనే చర్చించారు.
Also Read : వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్ కు కారణం అదేనా!
* రేపు రాత్రి ఢిల్లీలోనే బస..
అయితే రేపు ఢిల్లీ( Delhi) వెళ్తున్న చంద్రబాబు సతీ సమేతంగా వెళ్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. శుక్రవారం రాత్రికి చంద్రబాబు ఢిల్లీలోనే బస చేయనున్నారు. శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖ వెళ్తారు. అక్కడ నుంచి హెలిక్యాప్టర్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల చేరుకుంటారు. అక్కడ మత్స్యకార భరోసా నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చేపల వేట నిషేధం ఉంది. ఎటా వేసవిలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఆ సమయంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు ఒక్కొక్కరికి 20వేల రూపాయల చొప్పున భృతి అందించనుంది ప్రభుత్వం. శనివారం ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు.
* సీఎం చంద్రబాబు బిజీ..
సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న క్రమంలో ఈరోజు కూడా బిజీగా గడిపారు. ఉదయం 11:30 గంటలకు సచివాలయానికి ( Secretariat) వెళ్లి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. 11:30 గంటల నుంచి రెండు గంటలపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ పై వర్క్ షాప్ లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ కార్యదర్శి చంద్రశేఖర్ హాజరయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు.
* ప్రధాని టూర్ కు ఏర్పాట్లు
అమరావతి రాజధాని( Amravati capital) పునర్నిర్మాణ పనులకు మే రెండున ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 5 లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అమరావతికి భారీ వరాలు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. వాటి కోసమే సీఎం చంద్రబాబు చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి అయితే మే మొదటి వారంలో ఏపీలో రాజకీయంగా సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.
Also Read : మాజీ మంత్రి విడదల రజిని చుట్టు ఉచ్చు.. బెదిరింపు కేసులో కీలక అరెస్ట్!