Jack : ‘టిల్లు స్క్వేర్’ వంటి సంచలనాత్మక చిత్రం తర్వాత సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda), బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్'(Jack Movie). టీజర్, ట్రైలర్, పాటలు ఏవి పెద్దగా క్లిక్ కాకపోయినా కేవలం సిద్దు సినిమా అని ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉండేవి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. సిద్దు జొన్నలగడ్డ తన యాక్టింగ్ టాలెంట్ తో ఈ సినిమాని నిలిపే ప్రయత్నం ఆరంభం నుండి చివరి వరకు చేసాడు కానీ, కథ ఆసక్తికరంగా లేకపోవడంతో సినిమా పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది. థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ని సొంతం చేసుకోలేకపోయిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని భారీ రేట్ కి నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది.
Also Read : ‘జాక్’ ఓపెనింగ్స్ అదుర్స్..సైలెంట్ గా వచ్చి దున్నేస్తున్నాడుగా!
మే 1 నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, హిందీ ,తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యం లో కాసేపటి క్రితమే నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యినప్పటికీ, ఓటీటీ లలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకోవడం వంటివి ఈమధ్య కాలంలో చాలానే చూసాము. ‘జాక్’ చిత్రం కూడా అలా ఓటీటీ లో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. అదే కనుక జరిగితే సిద్దు జొన్నలగడ్డ చేసిన ప్రయత్నం కొంతమేరకు అయినా రీచ్ అయ్యింది అని అనుకోవచ్చు. ఈ చిత్రం లో హీరోయిన్ గా వైష్ణవి చైతన్య నటించగా, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర పోషించాడు. సినిమా మొత్తం ఎక్కువ శాతం ప్రకాష్ రాజ్, సిద్దు జొన్నలగడ్డ మీదనే సన్నివేశాలు ఉన్నాయి.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది, సినిమా ఓవరాల్ గా డీసెంట్ గా ఉంటుంది, ఫస్ట్ హాఫ్ వరకు ఎలాంటి వంకలు పెట్టలేము, సిద్దు జొన్నలగడ్డ కామెడీ పలు సన్నివేశాల్లో బాగా వర్కౌట్ అయ్యింది. డీజే టిల్లు క్యారక్టర్ ని ఇష్టపడే వాళ్లకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ఇక ఆ క్యారక్టర్ నుండి బయటకు రాలేదా, ఇంకెన్ని రోజులు ఇలా అని అనుకునేవాళ్లకు మాత్రం ఈ సినిమా నచ్చకపోవచ్చు. కాసేపు టైం పాస్ చేద్దాం అనుకునేవాళ్లకు మాత్రం ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ని ఇస్తుంది. చూడాలి మరి ఓటీటీ లో అయినా ఈ చిత్రం ఆడియన్స్ ని అలరిస్తుందా లేదా అనేది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
Also Read : జాక్ ఫుల్ మూవీ రివ్యూ