spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawankalyan - AP Volunteers :  ఏపీ ప్రజల గుట్టు.. హైదరాబాద్ లోని నానాక్ రామ్...

Pawankalyan – AP Volunteers :  ఏపీ ప్రజల గుట్టు.. హైదరాబాద్ లోని నానాక్ రామ్ గూడకు..

Pawankalyan – AP Volunteers :  ఏపీలో ఏ ఒక్కరూ వైసీపీ నుంచి తప్పించుకునే చాన్సే లేదు. నేను, నువ్వు అన్న తేడా లేకుండా అందరి జాతకాలను ఆ పార్టీ తన వద్ద పెట్టుకుంది. తోక జాడిస్తే వాటిని బయటపెడుతోంది. అందుకే ఆ పార్టీ నుంచి తరచూ వైనాట్ 175 అన్న స్లోగన్ వినిపిస్తోంది. ఇంట్లో పుట్టిన పిల్లాడి నుంచి పెన్షన్ తీసుకునే వృద్ధుడి వరకూ ప్రతిఒక్కరి సమాచారం వైసీపీ వద్ద ఉంది. ప్రతిఒక్కరి వ్యక్తిగత వివరాలు, కేసులు, అలవాట్లు, ఏ పార్టీ అభిమాని, ఆదాయం, కులం, మతం, వివాహేతర సంబంధాలు..ఇలా ప్రతి సమాచారం వైసీపీకి చెందిన కంప్యూటర్లలో నిక్షిప్తమై ఉంది. వలంటీర్లు సేకరించి అందించే డేటా వైసీపీ నేతకు ఎఫ్.వో.ఏ అనే ఏజెన్నీ చేతిలోకి వెళుతుంది.

పవన్ వలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు కొనసాగిస్తున్నారు. వలంటీర్లు సేకరిస్తున్న డేటా హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ఎందుకు దాస్తున్నట్టు అని తాజాగా ప్రశ్నించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎఫ్.వో.ఏ అంటే ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ. దీనికి యజమాని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2020లో ఏజెన్సీని ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్ల నెట్ వర్క్ ను ఈ ఏజెన్సీ కమ్యూనికేట్ చేస్తుంది.  అంటే డేటా డిటైలింగ్ బాధ్యత అన్న మాట.

వాస్తవానికి వలంటీరు ఎక్కువగా డేటా సేకరణలోనే నిమగ్నమవుతున్నారు. ప్రతి రెండు మూడు నెలలకు ఏదో ఒక సర్వే పేరిట ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పింఛన్ల పంపిణీ తరువాత వీరికి పని అంటూ ఏదీ లేదు. ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ నుంచి వచ్చే ఆదేశాలు అమలుచేయడమే వలంటీర్ల ప్రధాన విధి. సచివాలయ వ్యవస్థకు అనుసంధానంగా వలంటీర్లు పనిచేస్తున్నా.. అనధికార బాస్ మాత్రం ఆ ఏజెన్సీయే. కానీ ప్రజల వ్యక్తిగత సమాచారం ఆ ఏజెన్సీకి వెళుతుండడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది.

అప్పుడెప్పుడో జనాభా లెక్కల సమయంలో అడిగేవారు. కానీ ఇప్పుడు అయినదానికి, కానిదానికి అన్నింటికీ డేటా అడుగుతున్నారు. చివరకు వివాహేతర సంబంధాల వివరాలు, మద్యం అలవాట్లను సైతం సేకరించి ఏజెన్సీకి పంపిస్తున్నారు. ఆ వివరాలతో బ్లాక్ మెయిల్ తరహాలో కుట్రకు దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల డేటా చోరీకి గురైందని నానా యాగీ చేశారు. ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టు వలంటీర్ల ముసుగులో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారన్న మాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version