Homeఆంధ్రప్రదేశ్‌AP New Scheme: 18 ఏళ్లు నిండితే ఖాతాలో రూ.18 వేలు.. ఏపీ ...

AP New Scheme: 18 ఏళ్లు నిండితే ఖాతాలో రూ.18 వేలు.. ఏపీ మహిళలకు కొత్త ప్రభుత్వం కానుక

AP New Scheme: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఫస్ట్‌ ఇప్రెషన్‌ ఈజ్‌ బెస్ట్‌ ఇప్రెషన్‌ అన్నట్లుగా తమ పాలన తీరు బాగుందనిపించుకునేందుకు కొత్త ప్రభుత్వం మహిళలను ఆకట్టుకునేందుకు కొత్త స్కీం ప్రారంభించాలని భావిస్తోంది. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయంచింది. ఏడాదికి రూ.18 వేలు అందనుంది.

మహిళలను ఆకట్టుకునేలా..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా టీడీపీ ఈ స్కీం మేనిఫెస్టోలో పెట్టింది. ఓటరు అయిన ప్రతీ మహిళకు నెలకు రూ.1,500 చొప్పున అందిస్తామని ప్రకటించింది. వీటితో ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు, పప్పు, ఉప్పు లాంటివి తీసుకోవచ్చు. దీంతో ఇంటి ఖర్చుల భారం తగ్గుతుందని ఏపీ మహిళలు భావించారు. దీంతో మహిళలు ఎన్నికల్లో టీడీపీకి జైకొట్టారు.

అభివృద్ధి కూడా కావాలి..
ఇదిలా ఉంటే.. ఏపీలో సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి కూడా కావాలని ప్రజలు కోరుతున్నారు. జగన్‌ సర్కార్‌ కూడా అనేక సంక్షేమ పథకాలు అందించింది. కానీ, అభివృద్ధి కనిపించలేదు. ఈ క్రమంలోనే ఓటర్లు ఎన్నికల్లో ఆ పార్టీని తిరస్కరించారు. కొత్త ప్రభుత్వం కూడా అభివృద్ధిని వదిలేసి కేవలం సంక్షేమం తమ అజెండాగా ముందుకు వెళితే ప్రయోజనం ఉండదు, ఏపీ ప్రజలు దానిని స్వీకరించరు. ఇందుకు తాజా ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మరోవైపు రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు అయినా.. ఏపీకి రాజధాని లేకుండా పోయింది. ఇది కూడా వైసీపీ ఓటమికి కారణం.

రాజధాని కావాలని..
కొత్త ప్రభుత్వం అయినా రాజధాని నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. అది చంద్రబాబుతోనే సాధ్యమని నమ్మారు. అందుకే జగన్‌ సర్కార్‌ను సాగనంపారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కీలకం కావడంతో ఈ పని కూడా సులువు అవుతుందని భావిస్తున్నారు.

మేనిఫెస్టోలో కీలక పథకాలు..
ఇదిలా ఉండగా టీడీపీ మేనిఫెస్టోలో కీలక పథకాలు ప్రకటించింది. మెగా డీఎస్సీ ఫైల్ పై మొదటి సంతకం, సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్, బీసీలకు 50 ఏల్లకే రూ.4 వేల పింఛన్, యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం వంటివి ఉన్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
Peddi Sudarshan Reddy

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper