Andhra Pradesh Weather : ఏపీలో( Andhra Pradesh) వాతావరణం విచిత్రంగా ఉంది. గత కొద్ది రోజులుగా వర్షాలు కురిసాయి. ప్రస్తుతం మాత్రం ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రావడంతో మే నెలలోనే వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో ప్రజలు ఎండ బాధ నుంచి తప్పించుకున్నామని ఆనందపడ్డారు. కానీ ఇంతలోనే ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే దీనికి నైరుతి రుతుపవనాల మందగించడమే కారణమని తెలుస్తోంది. ఆ కారణంతోనే వానలు తగ్గి.. ఎండలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రమంతటా భగ్గు మంటుంది. అన్నిచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
* నాలుగు డిగ్రీలు అదనంగా..
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు( temperatures ) సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గురువారం విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ జిల్లాలలో ఉక్కపోత పాటు గరిష్టంగా 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది.
Also Read : ఏపీలో ఏంటీ ఉపద్రవం
* వర్షాలు తగ్గుముఖం..
అయితే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షాలు( rain) పడుతున్నాయి. గురువారం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలలో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మరో వారం రోజులపాటు ఏపీలో ఈ వాతావరణ పరిస్థితిలో కొనసాగే అవకాశం ఉంది. మే 26న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే అవి క్రమేపీ మందగించాయి. వేడి, ప్రేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ 11 తరువాత బంగాళాఖాతంలో కొత్త వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా రుతుపవనాలు బలపడతాయని అంచనా వేస్తున్నారు. అయితే రాబోయే నాలుగు రోజులు వేడి వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా కోస్తాంధ్రతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా నందిగామ, తుని, విశాఖపట్నం, నెల్లూరు, కావలి, మచిలీపట్నం, గన్నవరం, నరసాపురం వంటి ప్రాంతాలలో వేడి వాతావరణం కొనసాగనుంది.