Kavya Maran: ఐపీఎల్ సీజన్ 7 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా ఫైనల్ కి కూడా చేరుకుంది. ఇక ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ కలకత్తా నైట్ రైడర్స్ టీమ్ పైన తలబడడానికి రెడీ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే హైద్రాబాద్ టీమ్ యజమాని అయిన కావ్య మారన్ మాత్రం ఎన్ని డబ్బులు ఖర్చయినా కూడా వచ్చే ఏడాది హైద్రాబాద్ టీమ్ లో ఆ నలుగురు ప్లేయర్లను మాత్రం టీమ్ తోనే పెట్టుకుంటుందట.
ఇక వచ్చే సంవత్సరం ఐపిఎల్ మెగా వేలం ఉన్న సందర్భంగా టీమ్ లో ఉన్న చాలా మందిని టీమ్ నుంచి వదిలేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సందర్భంలో కావ్య మారన్ గారిని అడగగా ఆమె ఎట్టి పరిస్థితిల్లో ఆయన తమ టీం నుంచి నలుగురు ప్లేయర్లను మాత్రమే వదిలేసుకునే అవకాశం లేదంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఆ నలుగురు ఎవరు అంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, పాట్ కమ్మిన్స్, హెన్రీచ్ క్లాసన్ లతో కూడిన నలుగురు ప్లేయర్లను మాత్రం తను ఎప్పటికీ వదులుకోనని చెబుతుంది.
ఎందుకంటే ఈ సీజన్ లో హైదరాబాద్ ఫైనల్ కి వెళ్లడం లో ఈ నలుగురు కీలకపాత్ర వహించారు. ఇక ముందుగా హెడ్, అభిషేక్ శర్మ అయితే ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర వహించారు. ఇక అందువల్లే వాళ్ళను ఎప్పటికీ వదులుకోలేరనే విషయం అయితే మనకు చాలా స్పష్టం గా తెలుస్తుంది. ఇక ఈరోజు జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్న హైదరాబాద్ టీమ్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.
మరి ఇవాళ గెలిచి హైదరాబాద్ టీమ్ కి ఐపిఎల్ కప్పు అందిస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటి వరకైతే రెండు టీమ్ లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి చూడాలి మరి ఈరోజు జరిగే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది…