AP liquor scam
AP liquor scam : ఏపీ లిక్కర్ స్కాంపై( AP liquor scam) కేంద్రం దృష్టి పెట్టింది. హోంమంత్రి అమిత్ షా ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఏపీలో లిక్కర్ స్కాం పై లోక్సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మద్యం స్కాంతో వచ్చిన సొమ్మును విదేశాలకు తరలించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అయితే అక్కడకు 24 గంటలు గడవకముందే ఆయన అమిత్ షా వద్ద ప్రత్యక్షమయ్యారు. పూర్తి ఆధారాలను కేంద్ర హోంమంత్రికి అందించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆధారాలు పరిశీలించిన హోం మంత్రి తప్పకుండా చర్యలకు దిగుతామని చెప్పినట్లు సమాచారం. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇరకాటంలో పడినట్టే.
Also Read : ఏపీ లిక్కర్ స్కాం.. సిబిఐ, ఈడి ఎంట్రీ.. జగన్ చుట్టూ ఉచ్చు!
* రూ.90 వేలకోట్ల మద్యం విక్రయాలు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వ హయాంలో 90 వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి అని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో 18 వేల కోట్ల రూపాయలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పక్కదారి పట్టించినట్లు ఆరోపిస్తున్నారు టిడిపి నేతలు. మరో నాలుగు వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ కు చెందిన సునీల్ రెడ్డి ద్వారా విదేశాలకు తరలించినట్లు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలను అమిత్ షా చేతిలో పెట్టారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.
* హవాలా మార్గం ద్వారా..
ముఖ్యంగా అప్పటి బేవరేజెస్ ఎండి వాసుదేవరెడ్డి( Vasudeva Reddy ), అటు తరువాత సునీల్ రెడ్డి ఏ విధంగా నగదును విదేశాలకు పంపారు పూర్తిస్థాయి ఆధారాలను సేకరించగలిగింది టిడిపి. అప్పట్లో ఎంపీ మిధున్ రెడ్డి డిష్టలరీలను తన అదుపులోకి తెచ్చుకున్నారని.. సుమారు 18 డిస్టలరీలను అక్రమ మార్గంలో స్వాధీనం చేసుకున్నారని కూడా టిడిపి ఆధారాలు సేకరించగలిగింది. దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెడితే మరింత అవినీతి వెలుగు చూసే అవకాశం ఉందని లావు శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది.
* కేంద్రం ఫోకస్..
అయితే ఏపీలో మద్యం స్కాంపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ( Arvind Kejriwal )ఈడి అరెస్టు చేయగలిగింది. జైలులో పెట్టగలిగింది. అయితే అది సానుభూతి తెచ్చి పెడుతుందని కేజ్రీవాల్ భావించారు. కానీ అక్కడ ఢిల్లీలో బిజెపికి అనుకూల ఫలితాలు వచ్చాయి. ప్రజలు అవినీతి విషయంలో హర్షించరని.. అందుకే ఇప్పుడు ఏపీలో సైతం లిక్కర్ స్కాం విషయంలో ఈడి ఎంటర్ అయితే మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. అమిత్ షా సైతం ఈడిని ప్రయోగించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరి ఎలాంటి ఆదేశాలు వస్తాయో చూడాలి ఈ కేసు విచారణలో.
Also Read : కుక్కల ఆహారాన్ని వదల్లే.. ఏపీలో మరో అవినీతి!