Arogyasri : ఏపీ( Andhra Pradesh) ప్రజలకు ఆందోళనకు గురి చేసే న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాయి. రూ.3500 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఏప్రిల్ 7 వరకు సమయం ఇచ్చాయి. అంతటిలోగా చెల్లింపులు చేస్తే సరి.. లేకుంటే మాత్రం సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేశాయి. ఈ తరుణంలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది.
Also Read : కుక్కల ఆహారాన్ని వదల్లే.. ఏపీలో మరో అవినీతి!
* దేశానికే ఆదర్శం
గత కొన్ని సంవత్సరాలుగా ఏపీలో ఆరోగ్యశ్రీ( aarogyasree ) సేవలు అమలవుతున్నాయి. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ఈ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశస్థాయిలో ఆదర్శంగా నిలిచారు. అయితే ఏపీలో సైతం రాజశేఖర్ రెడ్డి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, పాలకులు ఆరోగ్యశ్రీని కొనసాగించారు. గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ సేవల పరిధిని పెంచడమే కాదు.. చాలా రకాల రుగ్మతలను అందులో చేర్చారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారు. దీంతో నిధుల సర్దుబాటు పేరుతో ఆరోగ్యశ్రీ కి సరైన సమయంలో చెల్లింపులు జరిగేవి కావు. దాని ప్రభావంతోనే ఇప్పటికీ కూడా పెండింగ్ కొనసాగుతూనే ఉంది.
* ఆది నుంచి పెండింగ్
రాష్ట్రంలో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చిన నాటికి దాదాపు 2000 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉండిపోయాయి. వాటిని ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు చేస్తూ వచ్చింది కూటమి ప్రభుత్వం. అయితే ఇటీవల గత మూడు నెలలుగా బిల్లులు మళ్లీ పేరుకుపోయాయి. 3500 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే నిధులు లేక నెట్వర్క్ ఆసుపత్రులు నిర్వహించలేకపోతున్నామని యాజమాన్యాలు చెబుతున్నాయి. అందుకే పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతున్నాయి. ఏప్రిల్ 7 వరకు గడువు పెట్టాయి. ఆ గడువులోగా చెల్లించకపోతే అత్యవసర సేవల సైతం నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
* ఏపీ ప్రభుత్వం అప్రమత్తం
మరోవైపు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం( AP government ) అప్రమత్తం అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోకుండా చూడాలని భావిస్తోంది. అందుకే వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల సంఘ ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు సిద్ధపడుతున్నారు. కొంత మొత్తం బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోకూడదన్నది ప్రభుత్వ టార్గెట్ గా సమాచారం. అయితే గతంలో కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఇదే తరహా ప్రకటనను జారీచేశాయి. మళ్లీ ప్రభుత్వం చర్చలు జరపడంతో వెనక్కి తగ్గాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని తెలుస్తోంది.
Also Read : మాకెందుకీ శిక్ష.. జైలుగోడల మధ్య వైసీపీ నేతల ఆక్రందన*