AP Scam : కూటమి ప్రభుత్వం( Alliance government ) దూకుడు మీద ఉంది. గత ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతోంది. దూకుడుగా వ్యవహరించిన నేతలపై కేసులు పెడుతోంది. మరికొందరు జైలు పాలవుతున్నారు. కొందరికి అయితే బెయిల్ కూడా లభించడం లేదు. కస్టడీల మీద కస్టడీలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రంలో కక్ష పూరిత రాజకీయాలు జరుగుతున్నాయని చెబుతోంది. కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ నేతలపై పట్టు బిగించే ప్రయత్నం చేస్తూనే ఉంది.
Also Read : ఏపీ లిక్కర్ స్కాం.. సిబిఐ, ఈడి ఎంట్రీ.. జగన్ చుట్టూ ఉచ్చు!
* నాసిరకం ఆహారం..
తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) హయాంలో జరిగిన ఓ కుంభకోణాన్ని బయటపెట్టింది. సాధారణంగా పోలీస్ శాఖలో జాగిలాల వినియోగం అధికంగా ఉంటుంది. నేర నియంత్రణకు జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయి. నేరం జరిగిన తరువాత కేసును ఛేదించడంలో వాటి పాత్ర కీలకం. అయితే అటువంటి జాగిలాలకు ఆహారం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి ఆహారం, జాగిలాల నిర్వహణలో కోట్లాది రూపాయల గోల్మాల్ జరిగినట్లు కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. దీనిపై విచారణకు ఉపక్రమించే అవకాశం కనిపిస్తోంది.
* జాగిలాలకు ప్రత్యేక శిక్షణ..
సాధారణంగా పోలీస్ జాగిలాలకు( police dogs) ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వాటి ఆహారం కూడా ప్రత్యేకమే. వాటి నిర్వహణకు భారీగా ఖర్చు కూడా అవుతుంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వాటికి నాసిరకం ఆహారం కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. భారీగా బిల్లులు చేసుకుని నాసిరకం ఆహారం పెట్టి.. వాటి అనారోగ్యానికి కారణమయ్యారన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరోవైపు కుక్క పిల్లల కొనుగోలు విషయంలో కూడా అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాని ఫలితంగానే ఇవి ఆశాజనకంగా పనిచేయలేదని.. చాలా చోట్ల అనారోగ్యంతో మృత్యువాత పడ్డాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఇది తెలియడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* వెలుగు చూస్తున్న లోపాలు, వైఫల్యాలు
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను( police department) మరింత గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు, వైఫల్యాలు బయటపడుతున్నాయి. పోలీస్ శాఖను అప్పట్లో నీరుగార్చారని.. అయితే అది కొంతమంది పోలీస్ అధికారుల తీరుతోనే జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన పోలీస్ అధికారుల తీరు బయటపడే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
Also Read : బిగ్ బ్రేకింగ్: కొడాలి నానికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు.. పరిస్థితి ఎలా ఉందంటే?