AP Legislative Council: టిడిపి కూటమి( TDP Alliance) ప్రభుత్వం భారీ ప్లాన్ వేసిందా? మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టనుందా? మండలిని సైతం చేజేక్కించుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఏకపక్ష విజయం సాధించింది. అయితే రాజకీయాలు అయిపోలేదని.. శాసనమండలి ద్వారా కూటమికి చెబుదామని జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్సీలకు పిలుపు ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు బిగిస్తోంది. అందుకే శాసనమండలి బలం తగ్గించేందుకు టిడిపి కూటమి పావులు కదుపుతోంది. ఏకంగా అవిశ్వాస తీర్మానానికి ప్లాన్ చేసినట్లు సమాచారం.
Also Read: విశాఖలో రాజకీయ వారసుల హల్ చల్
* ఇప్పటికీ శాసనమండలిలో బలంAP Legislative Council
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దారుణంగా ఓడిపోయింది. కానీ శాసనమండలిలో మాత్రం స్పష్టమైన బలం దిశగా అడుగులు వేసింది. సాధారణ ఎన్నికల సమయానికి శాసనమండలిలో బలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 38 గా ఉంది. వాస్తవానికి శాసనమండలిలో 58 మంది సభ్యులు ఉంటారు. కానీ నాలుగింట మూడో వంతు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది శాసనమండలిలో. పైగా చైర్మన్గా మోసేన్ రాజు ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి నియమించిన నేత. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు.
* మారిన సీన్
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీన్ మారింది. శాసనమండలి( assembly Council) ద్వారా రాజకీయాలు చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. సీనియర్ నేత బొత్స సత్యనారాయణను బరిలో దించారు జగన్మోహన్ రెడ్డి. గెలిచిన బొత్స సత్యనారాయణ కు శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా అవకాశం ఇచ్చారు. ఒకవైపు పార్టీకి చెందిన మోసేన్ రాజు శాసనమండలి చైర్మన్గా ఉన్నారు. మరోవైపు సీనియర్ నేత బొత్స నేతృత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇది కూటమికి ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. అందుకే అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
* చైర్మన్ పై అవిశ్వాసం..
వాస్తవానికి శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం 2027 వరకు కొనసాగనుంది. చైర్మన్గా ఉన్న మోసేన్ రాజు( chairman Mohsin Raju ) పదవి కాలం 2028 వరకు ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని ఓటమి భావిస్తోంది. అందుకే చైర్మన్ రాజు పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా 5 ఎమ్మెల్సీ స్థానాలను కూటమి సొంతం చేసుకుంది. మరో ఆరుగురు వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. మరికొందరు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గించుకోవాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం. ఒకవేళ అవిశ్వాస తీర్మానం గెలిస్తే శాసనమండలిలో ఉన్న ఒకే ఒక్క అవకాశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జారినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: వివేకానంద రెడ్డి వర్ధంతి.. షాక్ ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు!