Odela 2 : నిర్మాతలు ఈమధ్య కాలం లో భారీ నష్టాలను చూడడం అరుదు.. ఎందుకంటే డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ రూపం లో వాళ్ళు పెట్టిన బడ్జెట్ మొత్తం వడ్డీతో సహా తిరిగి వచ్చేస్తుంది. అంతే కాకుండా బోనస్ గా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా కలిసి వస్తున్నాయి. అందుకే ఈమధ్య కాలంలో ఏ హీరో కూడా పది కోట్ల రూపాయలకు తక్కువగా రెమ్యూనరేషన్ ని తీసుకోవడం లేదు. కేవలం హీరోలకు మాత్రమే కాదు, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కూడా ఇదే రేంజ్ బిజినెస్ జరుగుతుంది. ప్రముఖ హీరోయిన్ తమన్నా(Tamannaah Bhatia) ప్రధాన పాత్రలో, సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ఓదెల 2′(Odela 2) కి విడుదలకు ముందే బిజినెస్ మొత్తం జరిగిపోయింది. ఇటీవలే విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడం తో ఈ స్థాయి బిజినెస్ జరిగిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
Also Read : లేడీ ‘అఖండ’ గా తమన్నా..ఆసక్తి రేపుతున్న ‘ఓదెల 2′ టీజర్..’రచ్చ’ డైరెక్టర్ లో ఇంత విషయం ఉందా!
2022 వ సంవత్సరం లో ఆహా మీడియా లో విడుదలైన ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే వెబ్ ఫిలిం కి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ సినిమాని 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందట. అదే విధంగా హిందీ డబ్బింగ్ రైట్స్ ని 6 కోట్ల 50 లక్షలు అయ్యిందట. ఆడియో రైట్స్, సాటిలైట్ రైట్స్ కూడా కలిపి 25 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగిందని, సినిమాని నిర్మించడానికి కేవలాం 20 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యిందని చెప్తున్నారు. ఇలా విడుదలకు ముందు ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ హాట్ కేక్ లాగా అమ్ముడుపోవడం ఈమధ్య కాలం లో జరగలేదు. విడుదలకు ముందే లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా, విడుదల తర్వాత వచ్చే డబ్బులు, ఎంత వచ్చినా బోనస్ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
చాలా కాలం తర్వాత తమన్నా నుండి విడుదల అవ్వబోతున్న చిత్రమిది. ఆమె చివరిసారిగా మన తెలుగు ఆడియన్స్ కి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన ‘భోళా శంకర్’ చిత్రం ద్వారా కనిపించింది. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎక్కువగా ఆమె బాలీవుడ్ లోనే ఫోకస్ పెట్టింది. అక్కడ ఈమె అనేక అడల్ట్ రేటెడ్ వెబ్ మూవీస్, వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. తమన్నా ఇంత బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి ఎలా ఒప్పుకుంది అంటూ ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అలా ఎక్కువగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ అక్కడి ఆడియన్స్ కి దగ్గరైన తమన్నా, మన ఆడియన్స్ కి దూరమైంది. ఇప్పుడు కనీసం ‘ఓదెల 2’ అయినా ఆమె తన అభిమానులను మెప్పిస్తుందో లేదో చూడాలి.
Also Read : శ్రీకాంత్ ఓదెల చిరంజీవి తో చేసే సినిమా కోసం అన్ని వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారా..?