AP Govt: ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు వాళ్లకు రాయితీ రుణాలు కూడా అందిస్తుంది. యువతను ప్రోత్సహిస్తూ చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు అలాగే వాళ్ళ నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోంది. ఈ పథకంలో యువత లక్ష రూపాయలు నుంచి 8 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభివృద్ధి కోసం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మైనారిటీ యువతకు సోయం ఉపాధి కల్పించే లక్ష్యంగా ప్రభుత్వం రాయితీ రుణాలను కల్పిస్తుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను మైనారిటీ సంక్షేమ శాఖ రిలీజ్ చేసింది. ఈ పథకం కోసం ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.173.57 కోట్లను కేటాయించినట్లు సమాచారం. ఈ డబ్బుతో ప్రభుత్వం మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేలాగా సహాయం అందించనుంది. అలాగే యువతకు ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరి, ఈవెంట్ మేనేజ్మెంట్ వంటి వాటిలో ప్రభుత్వం శిక్షణ కూడా అందిస్తుంది. వీటికి అప్లై చేసుకోవాలంటే ఈరోజు నుంచి వచ్చే నెల 25 వరకు ఎంపీడీవో మున్సిపల్ కార్యాలయం కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.
Also Read: తీవ్ర అసంతృప్తితో ఆ టిడిపి సీనియర్ ఎమ్మెల్యే!
ఈ పథకంలో ప్రభుత్వం లబ్ధిదారులైన మైనారిటీలు యూనిటీ ఏర్పాటు చేయడానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని బ్యాంకు మొదట రిలీజ్ చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే రాయితీని బ్యాంకులో టర్మ్ డిపాజిట్ రూపంలో పెడతారు. దరఖాస్తు చేసుకున్న వాళ్లు యూనిట్ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి జియో టాకింగ్ చేస్తారు అధికారులు. దీనినే థర్డ్ పార్టీ ద్వారా అధికారులు రెండుసార్లు తనిఖీ చేస్తారు. ఆ తర్వాత యూనిట్ మొదలుపెట్టిన రెండేళ్ల తర్వాత మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు కూడా దీనిని మరోసారి తనిఖీ చేస్తారు.
ఆ సమయంలో బ్యాంకు నుంచి రుణం పొందిన లబ్ధిదారుడు డబ్బును సరైన సమయంలో సరిగ్గా కడుతున్నాడా లేడా అని అధికారులు తనిఖీ చేస్తారు. ఒకవేళ అన్ని వివరాలు సరిగ్గా ఉంటే రాయితీ డబ్బును అతని రుణం తీసుకున్న ఖాతాకు అధికారులు జమ చేస్తారు. మైనారిటీ లకు సంబంధించిన ఈ పథకంలో యువత లక్ష రూపాయల నుంచి ఎనిమిది లక్షల వరకు రుణం పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు లక్ష నుంచి ఎనిమిది లక్షల వ్యయంతో వాళ్లకు రాయితీ రుణాలను అందిస్తుంది.