RK Kotha Paluku: “ఇప్పటికే ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం అరెస్టులు మొదలుపెట్టింది.. ఒకప్పటి వైసిపి నాయకుడు.. రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణం లో సరికొత్త నిజాలు వెలుగుచూస్తున్నాయి. చూస్తుంటే ఈ వ్యవహారం ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని మించిపోయే విధంగా కనిపిస్తోంది. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలో వేల కోట్లు జగన్ వద్దకు చేరాయి. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి డబ్బులను వివిధ మార్గాల ద్వారా బయటికి పంపించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి అనేక విషయాలను విజయసాయిరెడ్డి చెబుతున్నారు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకమైన స్టాండ్ విషయంలో అదే పంథా కొనసాగించరు. పైగా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు అంటే నమ్మశక్యం కాని విషయం.. విజయసాయిరెడ్డి ఇవ్వాళ కాకపోయినా రేపైనా బిజెపిలో చేరడం ఖాయం. కేసుల భయం ఉంది కాబట్టి విజయసాయిరెడ్డి బిజెపిలో చేరే అవకాశం ఉంది.. జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు మొత్తం తెలుసు కాబట్టి విజయ సాయి రెడ్డి అప్రూవర్ గా మారగలడా.. అలా మరి బతికి బట్ట గలడ” ఇలా సాగిపోయింది ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఆదివారం నాటి కొత్త పలుకు.
Also Read: తీవ్ర అసంతృప్తితో ఆ టిడిపి సీనియర్ ఎమ్మెల్యే!
మరి వాటి గురించి మాట్లాడడేంది ?
విజయ సాయి రెడ్డి వ్యక్తిత్వం గురించి అడ్డగోలుగా రాసిన రాధాకృష్ణ.. మరి ఆయన వ్యక్తిత్వం గురించి ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? మొదట్లో భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా ఉన్న ఆయన.. తర్వాత స్టాండ్ ఎందుకు మార్చారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన ఆయన.. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఎలా మారిపోయారు.. ఈ విషయాలకు రాధాకృష్ణ సమాధానం చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు జరిగిన లిక్కర్ వ్యవహారం స్కాం లాగా రాధాకృష్ణకు కనిపిస్తోంది… కూటమి నేతలు అధికారంలోకి రావడానికి కారణమైన ఆరు గ్యారంటీల అమలు చేయకపోవడం మాత్రం కనిపించడం లేదు. దీనిపై ఇంతవరకు రాధాకృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాడు ఆరు గ్యారెంటీల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అని రాసిన ఆంధ్రజ్యోతి.. వాటి అమలు గురించి మాత్రం ప్రశ్నించలేకపోతోంది. చంద్రబాబు ఆ మధ్య కాగ్ నివేదికను ఉటంకిస్తూ.. ఏపీ అప్పలపాలయిందని చెప్పారు. పథకాల అమలు సాధ్యం కాదని తేల్చేశారు. ఆ విషయాన్ని ప్రముఖంగా రాసిన ఆంధ్రజ్యోతి.. హామీల అమలు గురించి మాత్రం మాట్లాడలేకపోతోంది. పాత్రికేయమంటే నిజాన్ని నిజం తీరుగా చెప్పాలి. సమస్యను సమస్య తీరుగా ప్రస్తావించాలి. అంతే తప్ప మనకు నచ్చితే ఒక విధంగా.. నచ్చకపోతే మరో విధంగా ఉండకూడదు. బహుశా రాధాకృష్ణ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన లిక్కర్ స్కాం అవినీతి వ్యవహారం లాగా కనిపిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాలంలో ఆరు గ్యారంటీల అమలు చేయకపోవడం ఆయనకు సమస్య లాగానే కనిపించడం లేదు.. ఇలాంటి పాత్రికేయానికి దమ్ము, ధూళి అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు గాని.. సైలెంట్ గా బి ఆర్ నాయుడు లాగా ఏదో ఒక పదవి తీసుకొని… వన్ సైడ్ వార్తలు రాస్తే సరిపోతుంది.. సారీ సారీ భజన చేస్తే సరిపోతుంది కదా.. ఈ న్యూట్రల్ ముసుగులు దేనికి..ఈ దమ్ము, ధైర్యం మాటలు దేనికి?