AP Government : ఈ పథకాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధి కూలీలను ఉపాధి శ్రామికులుగా పిలవాలని తెలిపారు. తాజాగా ఉపాధి హామీ కూలీల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చరిత్రత్మక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో రోజువారి కష్టపడుతున్న ఉపాధి హామీ కూలీలకు భద్రతను అందించే ముఖ్య లక్ష్యంతో వారికి ప్రమాద బీమా కల్పించనుంది. ప్రభుత్వం కొత్త ప్రణాళిక ప్రకారం ఉపాధి హామీ కూలీలకు ఒక్కొక్కరికి రెండు లక్షల వరకు జీవిత బీమా అందించబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి ఉపాధి హామీ కూలీలకు అందించే ఈ బీమా పథకాన్ని మరింత ప్రభావంతంగా అమలు చేసేందుకు ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి సాక్షిగా ఉండి ఉపాధి హామీ కార్మికుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రద్ధ చూపుతుంది అంటూ తెలియజేశారు. తాజాగా మే డే వేడుకలో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ శ్రామికులతో ముఖాముఖి సమావేశం జరిపారు.
Also Read : వైసీపీకి ఆ ఇద్దరు నేతలు షాక్!
ఈ సందర్భంగా మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగాపూరితమైన విజ్ఞప్తి చేశారు. రోజువారి కష్టపడే కార్మికులను కూలీలుగా పిలవడం మానేయాలని, మీరు ఉపాధి శ్రామికులు ఈ పదం వీరి శ్రమకు మరియు గౌరవానికి న్యాయం చేస్తుంది అంటూ ఆయన పిలుపునిచ్చారు. గ్రామాలలో ఉపాధి కూలీల శ్రమ లేకుండా ఎటువంటి అభివృద్ధి జరగదు. అలాగే రోడ్లు, చెక్ డ్యాములు, బావులు, పంచాయతీ భవనాలు ఇంకా మరెన్నో నిర్మించడానికి ఈ శ్రామికులే కష్టపడుతున్నారు అని తెలిపారు. ఇకపై ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలు మీడియా అందరూ కూడా ఉపాధి శ్రామికులుగా మార్పును గౌరవంగా స్వీకరించాలని ఆయన సూచించారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బీమా పథకం కింద ఒకవేళ పనిచేసే సమయంలో ప్రమాదవశాత్తు ఎవరైనా మరణించినట్లయితే ఆ ఉపాధి శ్రామికుడికి ప్రభుత్వం రెండు లక్షల జీవిత బీమా అందించనుంది. ఒకవేళ పని చేసే సమయంలో గాయపడినట్లయితే పరిహారాన్ని గతంలో 50,000 ఇచ్చేవారు. ప్రస్తుతం అది రెండు లక్షలకు పెంచారు. ఇది ఉపాధి శ్రామికుల భద్రతకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కథ నిర్ణయం ప్రకారం ఉపాధి శ్రామికుల కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం వ్యవస్థను అమలు చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది.