Balayya : తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబు (Balayya Babu) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలతో వరుస విజయాలను సాధించి ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తద్వారా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనే విషయంలో కూడా పలు రకాలుగా ఆలోచిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఇక వరుసగా నాలుగు విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న ఆయన ఇప్పుడు అఖండ 2(Akhanda 2) సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. బాలయ్య బాబు పూరి జగన్నాథ్ కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధమైతే ఉంది.
Also Read : బాలయ్య ఫ్యాన్స్ కి పండగే..’డాకు మహారాజ్’ ఓటీటీ వెర్షన్ లో 15 నిమిషాల సరికొత్త సన్నివేశాలు!
ఇక వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన ‘పైసా వసూల్’ (Paisa Vasool) సినిమా కమర్షియల్ గా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోనప్పటికి ఈ సినిమాకి చాలా మంచి గుర్తింపైతే లభించింది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుందంటూ గత కొన్ని రోజుల నుంచి చాలా వార్తలు వస్తున్నప్పటికి ఆ సినిమా మాత్రం రావడం లేదు. నిజానికి పూరి జగన్నాధ్ ప్రస్తుతం ప్లాపుల్లో ఉన్నాడు.
మరి ఇలాంటి సందర్భంలో బాలయ్య బాబు (Balayya Babu) సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి మరోసారి పూరీ జగన్నాథ్ సినిమా చేసి డీలాపడడం ఎందుకు అనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే పూరీ జగన్నాథ్ సైతం విజయ్ సేతుపతి తో ‘బెగ్గర్’ (Beggar) అనే సినిమాని ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ద్వారా పూరి జగన్నాథ్ ఎలాంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని ఉద్దేశంలో ఉన్నాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి పూరి జగన్నాథ్ తర్వాత చేయబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది.