Amaravati Re Launch: అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణానికి నేడు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని శంకుస్థాపన జరగడం ఇది రెండోసారి. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఆ పనులు కొనసాగించి ఉంటే ఆంధ్రుల కలల రాజధాని ఇప్పటికే సాకారం అయ్యేది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసింది. అలాగని తాను అనుకున్న మూడు రాజధానులను సైతం అందుబాటులోకి తేలేకపోయింది. 33 వేల ఎకరాల భూములను ఇచ్చిన అమరావతి రైతుల త్యాగాలకు సైతం విలువ లేకుండా పోయింది. అయితే అమరావతి రాజధాని భూముల సేకరణ నుంచి నిర్మాణాల వరకు ప్రణాళిక ఒక మహాద్భుతం. కానీ కార్యరూపం దాల్చడంలో మాత్రం ఎడతెగని జాప్యం జరిగింది.
Also Read: రెండోసారైనా.. అమరావతి ముందుకుసాగేనా?
* నవ నగరాల నిర్మాణం
అమరావతి రాజధాని లో నవ నగరాలు( 9 cities ) నిర్మించాలన్నది లక్ష్యం. దాదాపు 8603 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతంగా గుర్తించారు. ఇందులో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం నిర్మిస్తారు. 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్ ఉంటుంది. ఏపీ సిఆర్డిఏ యాక్ట్ 2014 ప్రకారం అమరావతి రాజధాని ఏర్పాటు అయింది. రైతుల స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వేలాది ఎకరాలు ఇవ్వడం అనేది ప్రపంచ రికార్డ్. కేవలం 58 రోజుల్లో ల్యాండ్ పోలింగ్ ద్వారా.. రాజధాని కోసం భూమిని సమీకరించారు. 34,281 ఎకరాలు భూ సమీకరణ ద్వారా ఇచ్చారు. 4300 ఎకరాలు భూ సేకరణ ద్వారా తీసుకున్నారు. మిగిలిన 15,167 ఎకరాల భూమి ప్రభుత్వ, అటవీ, కొండ, ఇతర భూములు ఉన్నాయి. మొత్తం 54 వేల ఎకరాలను సేకరించారు. ల్యాండ్ పోలింగ్ ద్వారా 29881 మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు.
* ఆ అనుభవంతో..
హైదరాబాద్ నగరం( Hyderabad city) అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉంది. 1995లో తొలిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. 1999లో సైతం అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలోనే హైదరాబాద్ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దారు. అదే అనుభవంతో నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. అమరావతిని ఆర్థిక, ప్రజా రాజధానిగా చేయాలని సంకల్పం పెట్టుకున్నారు. విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, నీటి వసతి, బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ తో ఆహ్లాదకరమైన, ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి రాజధానిని ప్రణాళిక సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. నవ నగరాలు నిర్మించాలన్నది ప్లాన్ కాగా.. పదుల సంఖ్యలో కేంద్ర సంస్థలకు భూములు ఇచ్చారు.
* ప్రభుత్వ రంగ సంస్థలు సైతం..
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానుండడంతో.. ప్రభుత్వ రంగ సంస్థలు( government Institute) సైతం అమరావతికి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే విట్, ఎస్సార్ ఎం, అమృత యూనివర్సిటీ, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చాయి. 131 కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు రాజధాని ప్రాంతంలో 1277 ఎకరాల భూమిని కేటాయించారు. పేదల ఇళ్ల కోసం 1402 ఎకరాలు కేటాయించారు. దాదాపు లక్ష కోట్ల తో అమరావతి రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. ఇందులో మొదటి దశకు రూ.55343 కోట్లు, రెండో దశ పనులకు రూ.41,170 కోట్లు ఖర్చు చేయనున్నారు.
Also Read: నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి అర్ధం అయ్యేది కాదు : పవన్ కళ్యాణ్