Homeఆంధ్రప్రదేశ్‌AP Government : ఏపీలో ఆ ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెంపు!

AP Government : ఏపీలో ఆ ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెంపు!

AP Government  : ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. త్వరగా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు గుడ్ న్యూస్ చెప్పింది. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలు గా మార్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీనివల్ల కార్యకర్తల జీతాలు కూడా పెరగనున్నాయి. అర్హులైన వారిని మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తారు. పదో తరగతి నిబంధనను పరిగణలోకి తీసుకుంటారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వం పై కొంత ఆర్థిక భారం పడుతుంది. అయితే వీటికి సంబంధించిన మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఐసిడిఎస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. దీంతో మినీ అంగన్వాడీ కార్యకర్తల్లో ఆనందం నెలకొంది. ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Also Read : ఆంధ్రకు కుంకి ఏనుగులు.. అసలేంటివి? వీటితో లాభమేంటి

* రేపు క్యాబినెట్ భేటీ..
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం( Cabinet meeting) రేపు జరగనుంది. దీనిపై మంత్రివర్గం చర్చించనుంది. ఆమోదం ముద్ర వేసేందుకు అవకాశం కనిపిస్తోంది. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలు గా మారిస్తే కార్యకర్తల జీతాలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు కూడా మరింత మెరుగు పడనుంది. అయితే కార్యకర్తలు విధిగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అటువంటి వారినే మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 4600 మంది కార్యకర్తలకు మేలు జరగనుంది. దీంతో ఆయా కుటుంబాలు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

* ఒకేసారి పెరగనున్న రూ.4,500
ప్రస్తుతం మినీ అంగన్వాడీ( mini anganwadi) కార్యకర్తలకు నెలకు ₹7,000 జీతం గా అందిస్తున్నారు. మెయిన్ అంగన్వాడి కార్యకర్తగా మారితే వారి జీవితం రూ.11,500కు చేరుకోనుంది. దీనివల్ల ప్రభుత్వంపై ఏటా 25 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 55, 700 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయి. మరో 6,837 మినీ అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. మెయిన్ అంగన్వాడి కేంద్రంలో కార్యకర్తలతో పాటు ఆయా ఉంటారు. మినీ అంగన్వాడి కేంద్రంలో మాత్రం ఒక్క కార్యకర్త మాత్రమే ఉంటారు. గర్భిణులతోపాటు బాలింతలు, పిల్లలకు సేవలు అందించడానికి ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

* వీటిపై కీలక నిర్ణయాలు..
మినీ అంగన్వాడి కేంద్రాల్లో కార్యకర్తల పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. 200 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 4600 మినీ కేంద్రాల్లో పనిచేస్తున్న వారు పదో తరగతి పాసయ్యారు. మిగిలిన చోట్ల పనిచేస్తున్న వారికి పదో తరగతి పాస్ అయ్యేందుకు గడువు ఇవ్వనున్నారు. ఇంతలో అర్హత సాధించిన వారికి మెయిన్ అంగన్వాడీలు గా మారుస్తారు. మినీ అంగన్వాడి కేంద్రాల్లో దాదాపు 300 చోట్ల ఐదుగురి కంటే తక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారు. అటువంటి కేంద్రాలను సమీప అంగన్వాడి కేంద్రాల్లో విలీనం చేయనున్నారు. దీనిపై సైతం మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. రేపటి మంత్రివర్గ సమావేశంపై అందరిలోనూ ఒకటే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అంగన్వాడి కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version