AP Elections 2024: ఏపీలో అల్లర్ల వెనుక ఆ ఇద్దరు?

చంద్రబాబుతో పాటు పురందేశ్వరి డైరెక్షన్ తోనే ఇదంతా జరుగుతోందని వైసిపి తాజాగా ఆరోపణలు చేసింది. శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి ఏపీలో ఇంత జరుగుతున్నా యంత్రాంగం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.

Written By: Dharma, Updated On : May 18, 2024 11:31 am

AP Elections 2024

Follow us on

AP Elections 2024: ఏపీలో నెలకొన్న హింసకు ఇద్దరే కారణమా? వైసిపి ఆరోపణల్లో నిజం ఎంత? పోలింగ్ అనంతరం ఏపీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పల్నాడు, మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరిలో వైసీపీ శ్రేణులపై దాడులు జరిగినట్లు ఆ పార్టీ ఆరోపిస్తోంది. అటు ఎమ్మెల్యేల గృహనిర్బంధాన్ని కూడా సీరియస్ గా తీసుకుంది. పేరుకే తాము అధికారపక్షం కానీ.. తెలుగుదేశం పార్టీ దాడులు చేయిస్తోందని ఆరోపణలు చేయడం ప్రారంభించారు.

అయితే చంద్రబాబుతో పాటు పురందేశ్వరి డైరెక్షన్ తోనే ఇదంతా జరుగుతోందని వైసిపి తాజాగా ఆరోపణలు చేసింది. శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి ఏపీలో ఇంత జరుగుతున్నా యంత్రాంగం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పక్కా ప్రణాళికతోనే వైసీపీ శ్రేణులపై దాడులు పెరిగినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ కు కొద్ది రోజుల ముందు పోలీస్ అధికారులను బదిలీ చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎక్కడైతే అధికారులను మార్చారో అటువంటి ప్రాంతాల్లోనే దాడులు జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. ఇదంతా పక్కా ప్లాన్ తోనే జరిగినట్లు.. దీని వెనుక చంద్రబాబుతో పాటు పురందేశ్వరి ఉన్నారన్నది వైసీపీ నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ.

వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా టిడిపి కనుసనల్లో పనిచేస్తున్నట్లు వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. టిడిపి నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ, పేద వర్గాలపై దాడులు చేయిస్తున్నారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దాడుల వెనుక అధికారి దీపక్ మిశ్రా ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీస్ యంత్రాంగం కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్.. అబ్జర్వర్ గా దీపక్ మిశ్రా ను నియమించింది. అయితే ఆయన ఎక్కడా కనిపించకపోవడంతో వైసిపి అనుమానిస్తోంది. ఆయన ఆదేశాలతోనే ఈ దాడులు జరుగుతున్నట్లు వైసీపీ నుంచి ఆరోపణలు రావడం విశేషం.