https://oktelugu.com/

South Actress: ఇండియన్ ఇండస్ట్రీని ఏలుతున్న కొండజాతి అమ్మాయి… ఆ హీరోయిన్ ఎవరో తెలుసా?

ఏకంగా వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లో ఐకానిక్ రోల్ చేస్తుంది. ఈ తరం హీరోయిన్స్ లో ఆమె చాలా ప్రత్యేకం. పెద్దగా అందగత్తె కాకున్నా తన అభినయంతో నటిగా పేరు తెచ్చుకుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : May 18, 2024 / 11:01 AM IST

    Unknown Facts About Sai Pallavi

    Follow us on

    South Actress: ఓ మారుమూల కొండ ప్రాంతంలో పుట్టిన అమ్మాయి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సౌత్ లో సత్తా చాటిన అమ్మడు నార్త్ లో అడుగుపెట్టింది. ఏకంగా వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లో ఐకానిక్ రోల్ చేస్తుంది. ఈ తరం హీరోయిన్స్ లో ఆమె చాలా ప్రత్యేకం. పెద్దగా అందగత్తె కాకున్నా తన అభినయంతో నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె గొప్ప డాన్సర్ కూడాను. ఇప్పటికే మీకు ఆ హీరోయిన్ ఎవరో ఒక అవగాహన వచ్చి ఉంటుంది. పైన ఇచ్చిన వివరణ హీరోయిన్ సాయి పల్లవి గురించి.

    సాయి పల్లవి అరుదైన నటి. హీరోయిన్ అంటే మంచి ఫిజిక్, చక్కని రూపం ఉండాలనే రూల్స్ ని ఆమె బ్రేక్ చేసింది. సాయి పల్లవి హీరోయిన్ మెటీరియల్ కాదు. అందం లేకపోయినా అభినయం ఉంటే రాణించగలం అని నిరూపించింది. సాయి పల్లవి ఆఫర్స్ కోసం వెంపర్లాడదు. ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినా ఎక్స్పోజ్ చేయదు. స్టార్ హీరో సినిమా ఆఫర్ అయినా.. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఒప్పుకోదు.

    రెమ్యునరేషన్ కోసం డిమాండ్ చేసే నటి కాదు. నిర్మాతలు నష్టపోతే రెమ్యూనరేషన్ తిరిగిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని టాక్. చాలా సింపుల్ మేకప్ తో సిల్వర్ స్క్రీన్ పై కనిపించే ఏకైక నటి. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న సాయి పల్లవి పుట్టింది ఒక వెనుకబడిన తెగలో. సాయి పల్లవి సొంత ఊరు కోటగిరి. తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి డిస్ట్రిక్ట్ లో కోటగిరి ఉంది. ఇది ఒక హిల్ స్టేషన్. అక్కడ బడగ అని పిలవబడే అడవి తెగ ఒకటి ఉంది. ఆ తెగకు చెందిన అమ్మాయే సాయి పల్లవి.

    అయితే సాయి పల్లవి విద్యాభ్యాసం మొత్తం కోయంబత్తూర్ లో సాగింది. అనంతరం జార్జియా దేశంలో మెడిసిన్ పూర్తి చేసింది. సాయి పల్లవికి డాన్స్ ఆన్స్ చాలా ఇష్టం. మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్ లను చూసి స్ఫూర్తి పొందింది. ప్రేమమ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన సాయి పల్లవి స్టార్ గా ఎదిగింది. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం మూవీలో సీత పాత్ర చేస్తుంది. రన్బీర్ కపూర్ రామునిగా నటిస్తున్నారు. ఈ మూవీ మూడు భాగాలుగా విడుదల కానుందని సమాచారం. అలాగే నాగ చైతన్యకు జంటగా తండేల్ మూవీ చేస్తుంది.