Homeఆంధ్రప్రదేశ్‌Election Commission: 'ఈ ఆఫీస్' పై ఈసీ సంచలనం

Election Commission: ‘ఈ ఆఫీస్’ పై ఈసీ సంచలనం

Election Commission: ఏపీ ప్రభుత్వం జారీ చేసే జీవోలు, అత్యవసర ఉత్తర్వులు అన్నీ ఎక్కడ దాస్తారో తెలుసా? ఈ ఆఫీసులో. కానీ గత ఐదు సంవత్సరాలుగా జగన్ హయాంలో జీవోలు వెబ్సైట్లో కనిపించలేదు. ఇది వివాదాస్పద అంశంగా మారింది. కోర్టులో కలుగజేసుకోవడంతో.. చివరకు ఆ జీవోలు వెబ్సైట్లో కనిపించాయి. అవి కూడా సవ్యంగా చూపించలేదు. దీనిపై విమర్శలు ఉండగానే.. ఇప్పుడు సడన్ గా ఈ ఆఫీసులో చేర్పులు మార్పులకు ప్రభుత్వం పూనుకుంది. అప్ గ్రేడేషన్ పేరుతో సమూలంగా మార్చాలనుకుంది. అయితే ఇందులో రాజకీయ దురుద్దేశం ఉందని.. కీలక ఉత్తర్వులను మాయం చేసేందుకే ఈ పనికి దిగారని విపక్షాలు అనుమానించాయి. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు చేశాయి. దీంతో ఈసీ ఏపీ ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఎన్నికల ఫలితాల తర్వాత.. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక చర్యలకు దిగాలని ఆదేశించింది. దీంతో అప్ గ్రేడేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.

గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ జీవోలు వెబ్సైట్లో కనిపించలేదు. 2008లో జీవో ఐ ఆర్ వెబ్సైట్లో ప్రారంభించారు. అటు తర్వాత అన్ని ప్రభుత్వాలు ఆ వెబ్సైట్ను అనుసరిస్తూ వచ్చాయి. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత పూర్తిగా ఈ వెబ్సైట్ను మూసేశారు. అప్పటినుంచి ప్రభుత్వ నిర్ణయాల డేటా, ఫైల్స్ అన్ని ఈ ఆఫీసులో ఉంటాయి. ఇప్పుడు దీన్నే సాఫ్ట్వేర్ అప్డేట్ పేరుతో మూసేయాలని అనుకున్నారు. కానీ దీనిపై టిడిపి అధినేత చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. కీలక ఉత్తర్వులను మాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ స్పందించింది. అప్ గ్రేడేషన్ పేరుతో ఈ ఆఫీసును ఇనాక్టివ్ చేయవద్దని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అప్ గ్రేడేషన్ వద్దని స్పష్టం చేసింది. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

ఈనెల 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పూర్తయింది. జూన్ 4న ఫలితాలను ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తోంది. ప్రజా తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈ సమయంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదు. కానీ జగన్ సర్కార్ మాత్రం అప్ గ్రేడేషన్ పేరుతో జీవోలను మాయం చేసే ఛాన్స్ ఉందని విపక్షాలు అనుమానిస్తున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా జగన్ సర్కార్ అనేక రహస్య జీవోలను విడుదల చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కోర్టులో విచారణ కూడా కొనసాగింది. అయితే సరిగ్గా ఎన్నికల కోడ్ ఉండగానే ఈ అప్ గ్రేడేషన్ గుర్తుకు రావడం అనుమానాలకు తావిస్తోంది. దానికి ఎలక్షన్ కమిషన్ చెక్ చెప్పింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version