AP Development : ఏపీ అభివృద్ధి పై( AP state development ) ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి తెప్పించడం ద్వారా ఉద్యోగ, ఉపాధితో పాటు ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖకు క్యూ కడుతున్నాయి. ఇంకోవైపు తీర ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు ఆయా యాజమాన్యాలు ముందుకు వస్తున్నాయి. మరోవైపు ప్రపంచ స్థాయిలో నౌక నిర్మాణం, నౌకల మరమత్తుల కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయనున్నారు. సుమారు రెండువేల ఎకరాల్లో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో.. ఏపీ సీఎం చంద్రబాబు సైతం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఈ పరిశ్రమ ఏర్పాటుకు చొరవ చూపుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి సర్బానంద్ సోనోవాల్ తో సహా ప్రముఖులతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Also Read : కేశినేని నాని, చిన్ని.. మధ్యలో కొలికపూడి!
* వేలాదిమందికి ఉపాధి
ఏపీలోని దుగరాజపట్నంలో( dugarajapatnam) ఉన్న తీర ప్రాంతంలో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. తద్వారా నెల్లూరు, ప్రకాశం తో పాటు రాయలసీమ జిల్లాలకు ఉపాధి లభించనుంది. ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు అయ్యే నౌకామరామత్తుల కేంద్రం ద్వారా.. ప్రపంచస్థాయిలో నౌకలను ఇక్కడ మరమత్తు చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి నిధులను కేంద్రమే అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం భూమిని మాత్రమే ఇవ్వనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం విశేషం.
* కేంద్రం సాయం..
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తూ వస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సైతం నిధులు మంజూరు చేసింది. విశాఖలో లక్షల కోట్ల పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు సైతం ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో ఏపీ నుంచి వినతులు వెళ్లడమే తరువాయి.. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం అవుతూ వస్తోంది. ఇప్పటికే అమరావతి రాజధానిలో కేంద్రం రోడ్డు,రవాణాకు సంబంధించి కీలక ప్రాజెక్టులను మంజూరు చేసింది. అమరావతి రాజధాని తో సమానంగా కేంద్ర ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే దూగరాజ పట్నంలో నౌకా మరమత్తుల కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ పరిణామం.
* తమిళనాడుకు సైతం..
అయితే ఒక్క ఏపీకే కాకుండా తమిళనాడుకు ( Tamil Nadu )సైతం ఈ ప్రాజెక్టు మంజూరైనట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుతో తీర ప్రాంతం కాలుష్య భరితంగా మారుతుందని విమర్శలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ముందుకు రాకపోవడం వల్లే ఏపీకి కేటాయించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు కాలుష్య నియంత్రణకు సైతం కేంద్రం అనేక చర్యలు తీసుకుంటుందని.. ఈ కేంద్రం ఏర్పాటుతో ఏపీ పేరు ప్రపంచ స్థాయిలో బలంగా వినిపిస్తుందని ఏపీ సర్కార్ చెబుతోంది. పరిశ్రమలు అంటేనే కాలుష్యం అంటున్నారని.. ప్రపంచస్థాయి గుర్తింపు కలిగిన ఇటువంటి ప్రాజెక్టు తేవడంతో ఏపీ రూపురేఖలు మారుతాయి అని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. పరిశ్రమను వ్యతిరేకించాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది.
Also Read : తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్..