AP Annadata Sukhi Bhava Scheme Update: ఏపీ ప్రభుత్వం( AP government) దూకుడు మీద ఉంది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలు విషయంలో వరుసగా సానుకూల నిర్ణయాలు తీసుకుంది. మొన్నటికి మొన్న తల్లికి వందనం పథకం అమలు చేసింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు సాయం చేసేందుకు నిర్ణయించింది. రేపు కేంద్రం అందించే పీఎం కిసాన్ సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 5000 రూపాయలు అందించేందుకు సిద్ధపడింది. కానీ ఇంతవరకు సీఎం కిసాన్ నిధులపై కేంద్రం నుంచి స్పష్టత రాలేదు. దీంతో రేపు పథకం నిధుల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
Also Read: Re-apply Talli ki Vandanam AP: తల్లికి వందనం’ డబ్బు రాలేదా? అయితే వెంటనే ఇలా చేయండి
ఏర్పాట్లు పూర్తి
అయితే రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఏపీ అధికారులు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) పథకానికి సంబంధించి అర్హుల జాబితాలను కూడా సిద్ధం చేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి 45,64,005 మంది రైతులు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. వారిలో ఎప్పటికీ 44,30,149 మంది రైతులు ఈ కేవైసీ పూర్తి చేశారు. మరో 1,20,148 మందికి సంబంధించి ఈ కేవైసీ పెండింగ్లో ఉంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో చివరిసారిగా 2024 జనవరిలో 53.58 లక్షల మంది రైతుల ఖాతాలో అప్పట్లో రైతు భరోసా సొమ్ము జమ అయ్యింది. అయితే అప్పటితో పోలిస్తే ప్రస్తుతం 7.94 లక్షల మంది లబ్ధిదారులు తగ్గినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యలతో పాటు రెవెన్యూ పరమైన చిక్కులు ఎదురుకావడంతో లక్షలాది మంది రైతుల వివరాలు పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా వైసీపీ హయాంలో చేపట్టిన భూ సమగ్ర సర్వే తో అనేక భూ సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం అమలు విషయంలో అవి ఆటంకంగా మారుతున్నాయి.
Also Read: AP Super Six Implementation: సూపర్ సిక్స్’ అమలు.. కూటమి ప్లాన్ అదే!
భూ సర్వే ఫలితం
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో భూ సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పట్లో జాయింట్ ఎల్ పి ఎం, ఆధార్ అనుసంధానం, మ్యు టేషన్లు, మరణించిన వారి పేర్లతో భూమి ఉండడం వంటి సమస్యలు కారణంగా నిరాకరించినట్లు తెలుస్తోంది. ఒకే రైతు పేరుతో అధిక విస్తీర్ణంలో భూమి చూపించడం, వెబ్సైట్లో ఒకరి సర్వే నెంబర్లు వేరొకరి భూమి నమోదు కావడం తదితర సమస్యలతో ముడిపడి ఉన్న రైతుల ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంది. ఈ కారణంగానే ఎక్కువ దరఖాస్తులు పెండింగ్లో ఉండిపోయాయి. ప్రస్తుతం రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాలను తహసిల్దార్ ల లాగిన్ కు పంపారు. తహసిల్దార్లకు పంపిన పెండింగ్ కార్డులను మినహాయించి ప్రభుత్వం అప్రూవల్ అయిన మేరకు జాబితాలను ఖరారు చేశారు. గత ప్రభుత్వం డి పట్టాత్తోపాటు ఓఆర్ఎఫ్ ఆర్ సాగుదారులకు రైతు భరోసా వర్తింపజేసింది. అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభవకు వారు అర్హులా? కాదా? అన్న విషయం తెలియాల్సింది. వెబ్ సైట్ లో ఆ రైతుల భూములను ప్రభుత్వ భూములుగా చూపించడంతో పరిగణించడం లేదని సమాచారం. ఈ ఒక్క కారణంగానే లక్షల మంది రైతులు అన్నదాత సుఖీభవకు దూరమయ్యే అవకాశం ఉంది. అయితే వీరి విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.