Ahmedabad Plane Accident: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. ఈ విషాదం తర్వాత మనదేశంలో తిరుగుతున్న లోహ విహంగాలలో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ ఘటన తర్వాత అనేక లోహవిహంగాలు లోపాలు బయటపడటంతో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి
అహ్మదాబాద్ ఘటన మనదేశంలో కోలుకోలేని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం తర్వాత విమానయానంలో అనేక లోపాలు.. సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి.
వీటిని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది.. అధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సమస్యలపై అధ్యయనం చేస్తోంది. వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన మార్గాలను ప్రభుత్వానికి సూచించడం ఉంది. ఇక ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంపై కేంద్రం నియమించిన ఒక కమిటీ దాదాపు విచారణ పూర్తి చేసిందని తెలుస్తోంది. ఈ ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో వివరాలను అందిస్తుందని సమాచారం.
అహ్మదాబాద్ ఘటన నేపథ్యంలో.. ఆ ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు విమానంలో ఎటువంటి మార్పులు సంభవించాయి? విమానాన్ని ఎక్కిన ప్రయాణికుల నేపథ్యం ఏమిటి? విమానం ఒక్కసారిగా కుప్ప కూలిన తర్వాత ఎంజే మెడికల్ కాలేజీలో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అక్కడ విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? విమానం ప్రమాదానికి గురైన తర్వాత లోపల ఎటువంటి మార్పులు చోటుచేసుకున్నాయి? భారీ విస్పోటనం తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరిగింది? అనే అంశాలపై కృత్రిమ మేధా ద్వారా వీడియో రూపొందించారు. ఈ వీడియో చూస్తుంటే కన్నీరు ఆగడం లేదు. గుండె బరువెక్కుతోంది. హృదయం ద్రవించి పోతోంది. ఆ విషాదాన్ని అంచనా వేయడానికి మాటలు సరిపోడం లేదు.
ముఖ్యంగా తన భార్య చితా భస్మాన్ని నర్మద నదిలో కలపడానికి ఏకంగా లండన్ నుంచి వచ్చిన ఒక భర్త నేపథ్యం అయితే కన్నీరు పెట్టిస్తోంది. ఓ నవ వధువు లండన్ లో స్థిరపడిన తన భర్త దగ్గరికి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదం.. ఆమె కుటుంబ సభ్యుల్లో తీరని శోఖాన్ని నింపింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కో నేపథ్యం. విమాన ప్రమాదంలో ఇంత మంది చనిపోవడం దేశ చరిత్రలో అత్యంత విషాదం నింపితే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన ఈ వీడియో మృతుల కుటుంబ సభ్యులను మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. కాకపోతే ఈ వీడియో ద్వారా అయినా మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని.. ప్రమాదానికి గల కారణాలను పూర్తిగా తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుందని నెటిజన్లు అంటున్నారు.. అయితే కృత్రిమ మేధా అనేది మనిషి చెప్పినట్టుగానే పనిచేస్తుంది కాబట్టి.. దానిని శాస్త్రీయ ఆధారంగా తీసుకోవడానికి అవకాశం లేదని మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో కంట తడి పెట్టిస్తోంది. గుండెను మెలి పెడుతోంది.
View this post on Instagram