Another Breaking : మరో సంచలనం : కేబినెట్ మీటింగ్ లో అసెంబ్లీ రద్దుపై జగన్ కీలక నిర్ణయం

బుధవారం జరిగే కేబినెట్ మీటింగులో ఏదో సంచలన ప్రకటన వచ్చే చాన్స్ ఉందని  ఎక్కువ మంది నమ్ముతున్నారు.

Written By: Dharma, Updated On : June 7, 2023 9:20 am
Follow us on

Another Breaking : ఏపీ సీఎం జగన్ నిజంగా ముందస్తుకు వెళతారా? మరి కొద్ది గంటల్లో ప్రకటించనున్నారా? కేబినెట్ భేటీ వేదికగా ఈ కీలక ప్రకటన ఉందా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ముందస్తు ఎన్నికల మాట ఇటీవల మరింత ఊపందుకుంది.సరిగ్గా జగన్ ఢిల్లీ వెళ్లి పెద్దలను కలిసి కేబినెట్ భేటీకి పిలుపునివ్వడంతో ఊహాగానం మరింత ఊపందుకుంది. మరికొద్ది గంటల్లో కేబినెట్ భేటీ జరగనుండడంతో అందరి ఫోకస్ అటువైపు పడింది. ముందస్తా? లేక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలా? అన్నది ఫుల్ క్లారిటీ రానుంది.

ముందస్తు అన్నదే లేదని వైసీపీ సీనియర్లు తేల్చిచెబుతున్నారు. జగన్ కు అత్యంత సన్నిహితుడు, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అస్సలు ముందస్తు అన్న ఆలోచనే తమ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలు ఐదేళ్ల పాటు అధికారాన్ని కట్టబెట్టారని గుర్తుచేశారు. తామెందుకు ముందస్తుకు వెళతామని ప్రశ్నించారు. దీంతో ముందస్తు అన్నది అనుమానమేనని తేలిపోయింది. కేబినెట్ కీలక మంత్రి, అందునా జగన్ కు అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి అలా ప్రకటించేసరికి ముందస్తు ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది.

జూలైలో, కాకుంటే అక్టోబర్ లో అసెంబ్లీని రద్దు చేస్తారని మరొకవైపు ఎవరికి తోచిన రీతిగా వారు విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు తరచూ ముందస్తు మాట మాట్లాడుతున్నారు. అయితే ఆయన వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్య చేస్తున్నట్టు విశ్లేషణలు వెలువడుతున్నాయి.ఇప్పటికే ఏడాది కాలంగా.. ముందస్తు ఎన్నికలు వచ్చేయబోతున్నాయి, పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండండి అని పదేపదే ఊదరగొడుతున్నారు. ఈ వ్యాఖ్యలతో పార్టీ శ్రేణులను యాక్టవ్ చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.

టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. బీజేపీని తమ దారిలోకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పొత్తు ఫార్ములాను ఢిల్లీ పెద్దల ముందు ఉంచారు. పొత్తు తేనెతుట్టను కదిపారు. ఇటువంటి సమయంలో చంద్రబాబుకు చాన్స్ ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. అందుకు ముందస్తుకు దిగుతున్నారని విశ్లేషకులు భావించారు. కానీ జగన్ ఆ ఆలోచనతో లేనట్టు తెలుస్తోంది. ఈ తరహా ప్రచారం వెనుక చంద్రబాబు ఉన్నట్టు స్పష్టమవుతోంది. కానీ ఎక్కడో ఒక అనుమానం మాత్రం వెంటాడుతోంది. బుధవారం జరిగే కేబినెట్ మీటింగులో ఏదో సంచలన ప్రకటన వచ్చే చాన్స్ ఉందని  ఎక్కువ మంది నమ్ముతున్నారు.