Homeఆంధ్రప్రదేశ్‌Andhra Premier League 2025: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ షురూ.. టీంలు ఇవీ.. యువతకు పండుగ

Andhra Premier League 2025: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ షురూ.. టీంలు ఇవీ.. యువతకు పండుగ

Andhra Premier League 2025: విశాఖలో( Visakhapatnam) మరో క్రీడా సంబరం ప్రారంభం అయ్యింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 4 టోర్నీ మొదలయింది. మధురవాడలోని ఏసీఏ- వీడిసిఎ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం అయింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ నటుడు వెంకటేష్ తో కలిసి తొలి మ్యాచ్లో తలపడుతున్న అమరావతి రాయల్స్, కాకినాడ కింగ్స్ జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకొని అభినందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివనాథ్, కార్యదర్శి సానా సతీష్, విశాఖ ఎంపీ శ్రీ భరత్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, చాముండేశ్వరి నాథ్ తదితరులు హాజరయ్యారు.

Also Read: రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తో సంజు శాంసన్ ఎక్కడ చెడింది?

ఆకట్టుకున్న డాన్సులు..
మరోవైపు ఏపీఎల్( APL) ప్రారంభంలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ డాన్స్ షో అదిరిపోయింది. సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల లైవ్ మ్యాజిక్ షో, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షోలు ఆకట్టుకున్నాయి. మొత్తం ఈ సీజన్లో ఏడు జట్లు తలపడుతున్నాయి. మొత్తం 25 మ్యాచ్లు జరగనున్నాయి. నాలుగు ప్లే ఆఫ్ లు ఉండబోతున్నాయి. ఈ టోర్నీలో విజయవాడ సన్ షైనేర్స్, రాయల్సాఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, అమరావతి రాయల్స్, కాకినాడ కింగ్స్, భీమవరం బుల్స్ చెట్లు తలపడనున్నాయి. ఐపీఎల్ మాదిరిగా రాష్ట్రస్థాయిలో ఈ లీగ్ నిర్వహించడం ద్వారా.. యంగ్ క్రికెటర్లకు అంతర్జాతీయ ప్రాతినిధ్యం కోసం అవకాశం కల్పించాలన్నది లక్ష్యం.

Andhra Premier League 2025
Andhra Premier League 2025
Andhra Premier League 2025
Andhra Premier League 2025

ఉచితంగా వీక్షించేందుకు అవకాశం..
అయితే విశాఖలో జరుగుతున్న ఈ మ్యాచ్ లను ఉచితంగా వీక్షించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్( Andhra Cricket Association) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉచిత ప్రవేశం ఉంటుంది. స్టేడియం గేటు నెంబర్ 15 నుంచి లోపలికి ప్రవేశం ఉంటుంది. ఈసారి ఏపీఎల్కు సినీ నటుడు విక్టరీ వెంకటేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండడం విశేషం. క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడతారు విక్టరీ వెంకటేష్. అందుకే ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. మ్యూజిక్, డాన్స్, సినీ నటులు హాజరు కావడంతో ప్రారంభోత్సవం మెగా ఈవెంట్ ను తలపించింది. ఈ లీగ్ మ్యాచ్లు చూసేందుకు ఐపీఎల్ సెలెక్టర్లు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అందుకే యంగ్ ప్లేయర్స్ కు క్రికెట్ కెరీర్ లో ఎదగడానికి ఇదో మంచి అవకాశమని ట్విట్ చేశారు నారా లోకేష్. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular