AP Cooperative Bank : ఏపీ కోఆపరేటివ్‌ బ్యాంకులో అప్రెంటీస్‌ ఖాళీలు.. వీరు అర్హులు!

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు గట్టి పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఏపీలో కోఆపరేటివ్‌ బ్యాంకు అప్రెటిస్‌షిప్‌ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 25 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది.అక్టోబర్‌ 28 వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

Written By: Raj Shekar, Updated On : October 25, 2024 11:36 am

AP Cooperative Bank

Follow us on

AP Cooperative Bank : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కోపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌(ఏపీసీఓబీ) అప్రంటిస్‌షిప్‌ ఖాళీల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ జిల్లాల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. దరఖాస్తు చేసుకునేందకు అక్టోబర్‌ 28 తేదీ వరకు అవకాశం ఉంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

ఖాళీలు ఇలా..
ఏపీ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌లో మొత్త 25 ఖాళీలు భర్తీ చేయనున్నారు. అందులో కృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లాల్లో 17, గుంటూరు జిల్లాలో 7, చిత్తూరు జిల్లాలో ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. అప్రంటిస్‌షిప్‌ వ్యవధి ఏడాది ఉంటుంది. ఇందుకు నెలకు 15 వేల స్టైఫండ్‌ ఇస్తారు.

అర్హలు వీరే..
బ్యాంకింగ్, కామర్స్, అకౌంటింగ్‌ అండ్‌ ఆడిట్, అగ్రికల్చర్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి తెలుగు, ఇంగ్లిష్‌ భాషల్లో చదవడం, రాయడంలో ప్రావీణ్యం ఉండాలి. దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పకుండా అప్రంటిస్‌షిప్‌ పోర్టల్‌ https://nats.education.gov.in/లో రిజిస్టర్‌ అయి ఉండాలి. దరఖాస్తు చేసే ముందే పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ పోర్టల్‌లో వందశాతం ప్రొఫైల్‌ నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే అప్రంటిస్‌ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా పంపాలి. అప్లికేషన్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌ డైరెక్ట్‌ లింక్‌ https://apcob.org/wp&content/uploads/2024/10/Apprenticeship&Application&Form&for&engagement&of&Apprentices.pdf క్లిక్‌ చేస్తే ఓపెన్‌ అవుతుంది. దీనిని ప్రింట్‌ తీసుకుని సంబంధిత సమాచారంతో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు అర్హత ధ్రువీకరణ పత్రాలు జతచేయాలి. తర్వాత ది డ్యూటీ జనరల్‌ మేనేజర్, హ్యూమన్‌ రిసోర్స్‌ డిపార్ట్‌మెంట్, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో ఆపరేటివ్‌ వ్యాంకు లిమిటెడ్‌ గవర్నర్‌పేట, విజయవాడ చిరునామాకు పంపాలి. వ్యక్తిగతంగా కూడా వెళ్లి ఇవ్వొచ్చు.

జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు
ఆధార్‌ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పదో తరగతి పాస్‌ సర్టిఫికెట్, ఇంటర్‌ మెమో, డిగ్రీ మెమో, బ్యాంకు పాస్‌బుక్‌ జిరాక్స్‌ పత్రాలు జత చేయాలి. అభ్యర్థుల వయసు 2024, సెప్టెంబర్‌ 1 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం..
అప్రంటిస్‌షిప్‌ఓసం డిగ్రీ మార్కులు, డ్యాకుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. అప్రంటిస్‌కు ఎంపిక అయిన అభ్యర్థులను ఉద్యోగులుగా గుర్తించడం జరుగదు. బ్యాంకు ఉద్యోగులకు వర్తించే బెనిఫిట్స్‌ ఏమీ వర్తించవు. దరఖాస్తు సమర్పించేదుకు అక్టోబర్‌ 28 వరకు గడువు ఉంది. ధ్రువీకరణ పత్రాలను నవంబర్‌ 2న పరిశీలిస్తారు.