https://oktelugu.com/

Meteorite : మహాసముద్రాల్లో మంటలు పుట్టించిన ఉల్క.. దాని చరిత్ర.. నేపథ్యం తెలుసా?

అంతరిక్షంలో అనేక ఉల్కలు ఉన్నాయి. అవి తమ కక్ష నుంచి గతి తప్పినప్పుడు భూమిపై పడడం సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే... ఓ ఉల్క భూమిపై ఉన్న సముద్రాన్నే భగభగ మండేలా చేసింది. 2014లో కనుగొన్న ఈ ఉల్క గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఉల్క మావన చరిత్రలోనే అతిపెద్ద సునామీకి కారణమైందని గురితంచారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 25, 2024 / 11:36 AM IST

    Meteorite

    Follow us on

    Meteorite :  భూమిపై 300 కోట్ల ఏళ్ల క్రితం డానోసార్లు ఉండేవి. వివిధ కారణాలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా అవి అంతరించిపోయాయని భావిస్తారు అయితే వీటి అంతానికి మరో కారణం కూడా ఉందని ఇటీవల గుర్తించారు. 2014లో గుర్తించిన ఉల్క కారణంగా డైనోసార్లు అంతరిపోయాయని గురి‍్తంచారు. రాళ్ల ముక్కలను పరిశీలించి ఈ ఉల్క ఎలా ఏర్పడిందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు సుత్తి, ఉలి, తీసుకుని దక్షిణాప్రికాలో గ్రహశకలం ఢీకొట్టిన ప్రాంతానికి వెళ్లారు. భారీ ఉల్క ప్రభావంతో భూమిపై విధ్వంసం మాత్రం జరగలేదని గురితంచారు. మనిషి జీవితం వృద్ధి చెందడానికి దోహదపడినట్లు ఆధారాలు గుర్తించారు.

    భూమి ప్రారంభంలోనే..
    ఈ ఉల్క భూమి ప్రారంభ దశలో ఉన్నపుపడే ఢీకొట్టింది. అప్పుడు భూమి చాలా విభిన్నంగా కనిపించేది. మొత్త నీళ్లతో ఉన్న ప్రాంతంలా ఉండేది. సముద్రాన్ని ఆనుకుని కొన్ని ఖండాలు మాత్రమే ఉండేవి. భూమి ఏక కణాలతో ఉండే సూక్ష్మ జీవులతో నిండి ఉండేది. తూర్పు బార్బెర్టన్‌ గ్రీన్‌ బెల్ట్‌లోని ప్రాంతం, భూమ్మీద ఉల్కల అవశేషాలు ఉన్న పురాతన ప్రాంతాల్లో ఒకటి. ​‍ప్రొఫెసర్‌ డ్రాబన్‌ పరిశోధనల కోసం తన సహచరులతో కలిసి మూడుసార్లు అక్కడకు వెళ్లారు. మారుమూల పర్వత ప్రాంతంలోకి వీలైనంత మేర మేర డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లారు. ఏనుగులు, ఖడ్గ మృగాల నుంచి జాతీయ పార్కులోని వేటగాళ్ల నుంచి రక్షణ కల్పించేంఉదకు రేంజర్లు మెషీన్‌ గన్లతో శాస్త్రవేత్తల బృందం వెంట వెళ్లారు. గ్రహ శకలం ఢీకొనడం వల్ల ఏర‍్పడిన చిన్న చిన్న రాతి శకలాల కోసం వెతికారు. సుత్తి ఉపయోగించి వందల కిలోల రాళ్లన సేకరించారు. వాటనిఇ తీసుకొచ్చారు. ఆ రాళ్లను పరిశోధనల కోసం ల్యాబ్‌కు పంపించారు.

    500 కిలోమీటర్ల బిలం..
    ఎస్‌2 ఉల్కగా దీనికి పేరు పెట్టిన పరిశోధకులు ఇది భూమిపైకి తీవ్రస్థాయిలో దూసుకొచ్చినట్లు గుర్తించారు. అది 500 కిలోమీటర్ల మేర బిలాన్ని ఏర్పరిచిందని తెలిపారు. ఇక రాతి శకలాలు ఎవరూ ఊహించలేనంత వేగంగా బయటకు వచ్చి భూమని ఢీకొట్టాయి. భూమి చుట్టూ ఒక మేఘంలా ఏర‍్పడ్డాయి. మేఘం నుంచి నీటి చుక్కలకు బదులు రాళు‍్ల వర‍్షంలా కురుస్తుంటే ఎలా ఉంటుందో అలా ఎగిసి పడ్డాయి. ఈ సమయంలో భూగోళాన్ని ఓ భారీ సునామీ చుట్టుముట్టింది. సముద్రపు అడుగు భాగాన్ని చీల్చివేసి తీర ప్రాంతాలను ముంచెత్తింది. ఆ సునామీతో పోలిస్తే 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ చాలా చిన్నదిగా తేల్చారు.

    సముద్రాలు మండేలా..
    ఇక ఈ ఉల్కాపాతం శక్తికి భారీస్థాయిలో ఉత్పత్తి అయిన వేడి సముద్రాలు కూడా భగభగా మండేలా చేసింది. ఆ వేడి తీవ్రతకు పదుల మీటర్ల నీరు ఆవిరైంది. గాలిలో ఉషో‍్ణగ్రతలు సైతం వందల డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పెరిగాయి. దీనికారణంగా ఆకావం నల్లగా మారిపోయి దుమ్మతో నిండిపోయింది. సూర్యరశ్మి ప్రసరించలేకపోతే భూమి మీద నీటిలో కిరణ జన్య సంయోగ క్రియ మీద ఆధారపడిన జీవజాలం మొత్తం అంతమయ్యేది.

    ఫాస్ఫరస్, ఐరన్ ఉనికి
    లక్కను పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం ఆశ్చర్యకరమైన విషయాలను గుర్తించింది. ఉల్కాపాతం వలన సాధారణ జీవులకు అవసరమైన పాస్పరస్‌, ఐరన్‌ వంటి పోషకాలు బయటపడ్డాయని రాతి ఆధారాల పరిశీలనలో తేలింది. ఇక జీవజాలం ఎంత వేగంగా ధ‍్వంసమైందో అంతే వేగంగా పునర్‌నిర్మితమైంది. భూమిని తుడిచిపెట్టేసే సునామీ కూడా ఐరన్‌తో ఉన్న నీటిని సముద్రపు లోతుల నుంచి ఉపరితలంపైకి తీసుకు వచ్చింది. ఈ ఉల్కాపాతం తర్వాత భూమిపై జీవజాలానికి మరింత అనుకూలమైన వతావరణం ఏర్పడిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.