Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi Remake Movies: చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్... ఈ ముగ్గురిలో ఎక్కువ రీమేక్ సినిమాలు...

Chiranjeevi Remake Movies: చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్… ఈ ముగ్గురిలో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన హీరో అతనే…

Chiranjeevi Remake Movies: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు రీమేక్ సినిమాలను చేసి సక్సెస్ లను సాధించిన వారే ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి నటులు వాళ్ళ కెరియర్ లోనే అత్యధికంగా రీమేక్ సినిమాలను చేశారు. ముఖ్యంగా చిరంజీవి ఇప్పటివరకు 150 పైచిలుకు సినిమాలను చేస్తే అందులో 40 సినిమాల వరకు రీమేక్ సినిమాలే ఉండడం విశేషం. ఇతర భాషల్లో సక్సెస్ లను సాధించిన సినిమాలను మన నేటి వీటికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయించి సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడంలో చిరంజీవి చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఇక కొన్ని సినిమాల కథల నుంచి స్ఫూర్తి పొంది అలాంటి కథలను ఫ్రెష్ గా రాయించి తీసి సక్సెస్ లను సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి…

విక్టరీ వెంకటేష్ సైతం తన కెరియర్లో 80 పైచిలుకు సినిమాలను చేశాడు. కాబట్టి ఆయన తన కెరీర్లో దాదాపు 30 సినిమాల వరకు రీమేక్ సినిమాలను చేయడం విశేషం…

ఇక పవన్ కళ్యాణ్ సైతం తన కెరియర్ లో చేసినవి చాలా తక్కువ సినిమాలే అయిన అందులో 12 రీమేక్ సినిమాలు ఉన్నాయి. ఆయన చేసిన సినిమాల్లో దాదాపు సగం రీమేక్ సినిమాలే ఉండటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి నటుడు స్టార్ హీరోగా మారడానికి రీమేక్ సినిమాల మీదనే ఆధారపడ్డాడు. ఈ ముగ్గురు హీరోల్లో కూడా వాళ్ళు చేసిన సినిమాల రేషియో ను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నింటిలో సగం సినిమాలు రీమేక్ లే ఉన్నాయి.

కాబట్టి సినిమాల సంఖ్యను బట్టి చూస్తే చిరంజీవి ఎక్కువ రీమేక్ మూవీస్ చేశాడు. కానీ వాళ్ళు తీసిన సినిమాల రేషియోను బట్టి చూస్తే ఎక్కువ రీమేక్ సినిమాలను చేసిన హీరోగా పవన్ కళ్యాణ్ ను మనం చెప్పుకోవచ్చు…ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరికొన్ని రీమేక్ సినిమాలను చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు… ఇక పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికి ఆయన సమయం దొరికినప్పుడు సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version