Lenin Movie : అక్కినేని అఖిల్ చేసిన లెనిన్ సినిమా విజయం ఇప్పుడు ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలేవి కూడా భారీ విజయాలను సాధించలేకపోతున్నాయి. ఈ సంక్రాంతికి వచ్చిన ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా తర్వాత ఒక్క సక్సెస్ కూడా రాలేదు. పెద్ద హీరోలు ఈ సంవత్సరం పెద్ద సినిమాలను రిలీజ్ చేయకపోవడంతో ఇండస్ట్రీ మొత్తం వెలవెలబోయింది. మొత్తానికైతే లెనిన్ సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కిందనే చెప్పాలి. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా మారలేకపోయింది. కాబట్టి లెనిన్ సినిమా ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోసిందని చాలా మంది చెబుతున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా రాబోయే రోజుల్లో కూడా సినిమా ఇండస్ట్రీ ఇదేవిధంగా ముందుకు దూసుకెళ్తే ఈ సంవత్సరం కూడా ఇండస్ట్రీ లాభాల బాట పడుతుందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి సినిమా లో ట్విస్టులు చాలా అద్భుతంగా ఉన్నాయి. మన స్టార్ హీరోలు చేసే సినిమాల్లో పెద్దగా ట్విస్ట్ లను వాడరు. చిన్న సినిమాల వరకే ట్విస్టు పరిమితమవుతుంటాయి.
థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమాల్లోనే మనం ట్విస్టులను ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఒక కమర్షియల్ సినిమాకి ట్విస్టులతో కూడిన హంగులను అద్దుతూ సినిమాని పెర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఆర్డర్లో నడిపించగలిగితే మాత్రం ప్రతి సినిమా ప్రేక్షకుడికి ఒక హై ఫీల్ ఇస్తుంది. దానివల్ల సినిమాను చూసిన ఫీల్ ప్రేక్షకుడికి కలగడమే కాకుండా సినిమాని సూపర్ సక్సెస్ గా నిలుపడానికి కూడా అవకాశాలైతే ఉంటాయి…
ఈ విధంగా కొన్ని ట్విస్టులతో కూడిన స్క్రీన్ ప్లే ని రాసుకొని ప్రేక్షకుడిని మెప్పించడానికి మరి కొంతమంది దర్శకులు సైతం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో లెనిన్ సినిమా ఇండస్ట్రీకి కొత్త పాఠం నేర్పింది అనే భావనలు కూడా వ్యక్తమవుతున్నాయి… ఇదే రీతిలో ముందుకు దూసుకెళ్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ మరోసారి పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకోవడం పక్క అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…
