Pawan Kalyan And Balakrishna: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నిజానికి స్టార్ హీరోల విషయంలో ఒక సక్సెస్ అనేది చాలా కీలకంగా మారుతుంది. సక్సెస్ ఫుల్ సినిమాను వదిలేసుకున్న హీరోలు తీవ్రమైన ఇబ్బందులను పడుతుంటే సక్సెస్ ఫుల్ సినిమాని చేసిన హీరోలు మాత్రం టాప్ పొజిషన్ కి వెళ్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే నందమూరి నటసింహం బాలయ్య బాబు సైతం పవన్ కళ్యాణ్ కోసం కొన్ని సినిమాలైతే వదిలేసుకున్నారట. ఇంతకీ ఆయన వదిలేసిన సినిమాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…
పవన్ కళ్యాణ్ కెరియర్ స్టార్టింగ్ లో చేసిన ‘గోకులంలో సీత’ సినిమా కథ మొదట బాలయ్య బాబు దగ్గరికి వెళ్లిందట. అయితే ఆ సినిమాను అప్పటికే పవన్ కళ్యాణ్ చేయడానికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న బాలయ్య అతని కోసం ఆ సినిమాని వదిలేసాడు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది…
మలయాళం సినిమా ఇండస్ట్రీలో అయ్యప్పనం కోషియం పేరుతో తెరకెక్కిన సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి పవన్ కళ్యాణ్ సన్నాహాలు చేసుకుంటున్న సందర్భంలో ప్రొడ్యూసర్ నాగ వంశీ ఆ సినిమా రైట్స్ ని తీసుకొని దానిని బాలయ్య బాబుతో చేయాలని అనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలుసుకున్న నాగ వంశీ తో బాలయ్య బాబు ఈ సినిమా నాకంటే పవన్ కళ్యాణ్ కి బాగా సెట్ అవుతుంది అతనితో చేయండి అని చెప్పాడట.
ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కోసం బాలయ్య రెండు హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు అంటూ అతని అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం బాలయ్య పవన్ కళ్యాణ్ ల మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. కాబట్టి వాళ్ళిద్దరి అభిమానులు కూడా వాళ్ళ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం…
