Allu Sirish Wedding Photos: ప్రముఖ యంగ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish) వివాహం ,నయనికా అనే అమ్మాయితో నిన్న హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. సాధారణంగా ఈమధ్య కాలంలో సెలబ్రిటీలు పెళ్లిళ్లు చాలా సింపుల్ గా, హంగులు ఆర్భాటాలు లేకుండా జరిగిపోతున్నాయి. ఉదాహరణకు రీసెంట్ గా విజయ్ దేవరకొండ , రష్మిక పెళ్లి ఎంత సింపుల్ గా కుటుంబ సభ్యులు, స్నేహితులు మధ్య జరిగిందో అందరికీ తెలిసిందే. వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా చేసుకున్నారు. దీనికి మాత్రం సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులూ పారిశ్రామిక వేత్తలు తదితరులు హాజరయ్యారు. వెడ్డింగ్ రిసెప్షన్ వరకు అందరూ గ్రాండ్ గా జరుపుకుంటూ వచ్చారు కానీ, పెళ్లి మాత్రం సింపుల్ గానే చేసుకునేవారు.
కానీ అల్లు శిరీష్ పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేసుకున్నాడు. నిన్న సాయంత్రం జరిగిన ఈ వివాహ మహోత్సవానికి ఎవరెవరు వచ్చారో ఒకసారి చూద్దాం. మెగా ఫ్యామిలీ లో ప్రతీ ఒక్కరు ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ వల్ల వస్తాడో రాదో అనుకున్నారు, కానీ ఆయన తన సతీమణి అన్నా లెజినోవా , కూతురు పొలేనా తో కలిసి వచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అంతే కాకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ పెళ్లి లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. హీరో సూర్య మొదటి నుండి అల్లు కుటుంబం తో మంచి సాన్నిహిత్యం మైంటైన్ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా పెళ్ళికి హాజరయ్యాడు. రామ్ చరణ్ , ఉపాసన , సుబ్బి రామిరెడ్డి, సాయి ధరమ్ తేజ్ , వైష్ణవ్ తేజ్ వంటి వారు ఈ పెళ్ళికి హాజరు అయ్యారు.
అందుకు సంబంధించిన ఫోటోలను మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి. అయితే అన్ని ఫోటోలు క్లారిటీ గా వచ్చాయి కానీ , పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రం క్లారిటీ గా రాలేదు. కేవలం ఒక చిన్న వీడియో క్లిప్ మాత్రమే బయటకు వచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన సతీమణి, కూతురు , రామ్ చరణ్ , ఉపాసన ఉన్నారు. పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ కలిసి ఉన్న ఒక్క ఫోటో అయినా బయటకు వస్తే బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు . కానీ అది రాలేదు , ఇకపోతే ఈ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు . అల్లు అరవింద్ తో కలిసి దగ్గరుండి మరీ పెళ్లి పనులు చూసుకున్నాడు.