Chandrababu: రికార్డ్.. ఆ పని చేసిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే…

Chandrababu: ఇచ్చిన హామీ లో భాగంగా పింఛన్లపై చంద్రబాబు నాయుడు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన సోమవారం స్వయంగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి మరి పింఛన్ మొత్తాన్ని అందించారు.

Written By: Chai Muchhata, Updated On : July 1, 2024 10:14 am

Andhra Pensioners get a surprise visit from CM Chandrababu

Follow us on

Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని ఓ పనిని బాబు చేసి ఘనత సాధించాడు. తాము అధికారంలోకి వస్తే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీ లో భాగంగా పింఛన్లపై చంద్రబాబు నాయుడు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన సోమవారం స్వయంగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి మరి పింఛన్ మొత్తాన్ని అందించారు. ఆ వివరాల్లోకి వెళితే

ఏపీ వ్యాప్తంగా సోమవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో సోమవారం ఉదయం 6 గంటలకు కాలనీలోని లబ్ధిదారుడి కుటుంబానికి స్వయంగా చంద్రబాబు నాయుడు పింఛన్ అందజేశారు. బాణావత్ పాముల నాయక్ అనే కుటుంబం చంద్రబాబు చేతుల మీదుగా పింఛన్ తీసుకొని ప్రత్యేకంగా నిలిచింది. అనంతరం చంద్రబాబు నాయుడు గ్రామంలోని మసీద్ సెంటర్ వద్ద నిర్వహించే ప్రజా వేదిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను పెంచుతానని చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రూ. 3,000 పింఛను అందుతుండగా.. రూ 1000 పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే పెరిగిన పింఛన్ తో పాటు ఏప్రిల్ నెల నుంచి 1000 చెప్పినా 3000 కలిపి మొత్తం 7000 రూపాయలను అందిస్తున్నారు.

పింఛన్ల పంపిణీ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పింఛన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి అయితే తొలి రోజు 100% పంపిణీ చేసేలా కార్యాచరణ పూర్తి చేశారు ఒక్కో సచివాలయ ఉద్యోగానికి 50 మంది పింఛనుదారులను కేటాయించారు అంతకుమించి ఉంటే అంగన్వాడి, ఆశా సిబ్బందిని వినియోగించనున్నారు. కాగా పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 4,408 కోట్లు విడుదల చేసింది.