Crime News : ఆదివారం.. సెలవు దినం.. పైగా వర్షాలు కురుస్తున్నాయి.. పక్కనున్న జలపాతం ఉత్తుంగ తరంగంలా ప్రవహిస్తోంది. దీంతో పిల్లలతో కలిసి ఆ జలపాతాన్ని చూడాలని ఆ వ్యక్తి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా కుటుంబంతో కలిసి ఆ జలపాతం దగ్గరికి బయలుదేరాడు. అప్పటిదాకా సరదాగా వారు అక్కడ ఆడి పాడారు.. ఆ తర్వాత అనుకోని విషాదం.. ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.
మహారాష్ట్రలో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు భారీగా వస్తుండడంతో లోనావాలా ప్రాంతంలోని డ్యాం పూర్తిగా నిండింది. డ్యామ్ లోకి వరదనీరు భారీగా వస్తోంది. పక్కనున్న జలపాతాల నుంచి నీరు విపరీతమైన వేగంతో డ్యాం లోకి ప్రవహిస్తోంది. అయితే లోనావాలా డ్యాం, పక్కనే ఉన్న జలపాతాన్ని చూసేందుకు మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం ఆదివారం అక్కడికి వచ్చింది. ఒక వ్యక్తి, తన భార్య.. నలుగురు పిల్లలతో కలిసి అక్కడ సరదాగా గడిపాడు. ఈలోగా వారు లోనా వాలా డ్యాం పక్కనున్న జలపాతం దగ్గరికి వెళ్లారు.. వర్షాలు కురుస్తుండటంతో ఆ జలపాతం లోకి నీటి ప్రవాహం తీవ్రంగా ఉంది. అయితే అనుకోకుండా అక్కడికి వెళ్లినవారు.. జలపాతం నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. ప్రవాహ వేగం పెరగడంతో ఆ నీటిలో కొట్టుకుపోయారు..
ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం ముగ్గురు బాలికలు, ఓ మహిళ (40), మరో బాలుడు ఆ నేటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. మహిళ, ఇద్దరు బాలికల మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే చనిపోయిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. గత కొద్దిరోజులుగా మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో..లోనా వాలా డ్యాం పూర్తిగా నిండింది. చుట్టుపక్కల ఉన్న వాగుల నుంచి డ్యామ్ లోకి విస్తృతంగా ప్రవాహం వస్తోంది.. ఆ ప్రవాహంలో చిక్కుకొని ఆ వ్యక్తి కుటుంబానికి చెందిన వారు చిక్కుకుపోయారని.. ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. వారు కొట్టుకుపోతున్న దృశ్యాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ వీడియో హృదయాలను కలచి వేస్తోంది.
In an unfortunate incident, A woman with 4 kids of a family drowned in a waterfall at Lonavala Bhushi Dam, Maharashtra.
2 bodies have been recovered 3 bodies are still missing.Be careful while visiting waterfalls and dams during the Mansoon season. pic.twitter.com/88PxMyd3Bc
— Baba Banaras™ (@RealBababanaras) June 30, 2024