Andhra Liquor Scam: ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam ) ప్రకంపనలు సృష్టిస్తోంది. వేలకోట్ల రూపాయలు మద్యం ద్వారా అక్రమంగా ఆర్జించారని వైసీపీ నేతలపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. అయితే ఈరోజు ఈ కేసుకు సంబంధించి చార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అంతిమ లబ్ధిదారుడు ఎవరన్నది తేలిపోనుంది. చార్జ్ షీట్ లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దాదాపు ఈ కేసుకు సంబంధించి 40 మంది నిందితులు ఉన్నట్లు సిట్ స్పష్టం చేసింది. అయితే ఓ 11మంది కీలక నిందితులను మాత్రమే అరెస్టు చేసింది. అయితే ఈ మద్యం కుంభకోణం విచారణ పుణ్యమా అని వైసిపి హయాంలో మంత్రులు డమ్మీలు అని తేల్చేసింది. 45 మంది నిందితులుగా చేర్చితే.. అందులో ఎక్సైజ్ మంత్రి లేకపోవడం ప్రస్తావించాల్సిన అంశం.
మూడేళ్ల పాటు అదే పదవిలో..
జగన్ సర్కార్లో ఎక్సైజ్ మంత్రిగా నారాయణస్వామి( Narayana Swamy ) ఉండేవారు. ఆయన మూడేళ్ల పాటు ఆ పదవిలో ఉండేవారు. ఆయన హయాంలోనే మద్యం కుంభకోణం జరిగిందన్నది కూటమి ప్రభుత్వ అభియోగం. అయితే ఈ మొత్తం కుంభకోణంలో ఆయన ప్రమేయం లేదని సిట్ తేల్చేయడం విశేషం. ఒక మంత్రికి తెలియకుండా ఇంతటి కుంభకోణం జరిగిందా అన్నది ప్రధాన అనుమానం. అయితే సిట్ దర్యాప్తులో తప్పిదాలు చోటు చేసుకోవాలి? లేకుంటే మంత్రికి తెలియకుండా.. ఆయనను డమ్మీ చేసి ఇంతటి కుంభకోణానికి పాల్పడి ఉండాలి. అయితే నారాయణస్వామి సైతం ఓ సీనియర్ వైసీపీ నాయకుడు. ఆయన విషయంలో కూటమి ప్రభుత్వం ఉపేక్షించే ఛాన్స్ లేదు. అయితే ఆయనకు తెలియకుండానే.. హైదరాబాద్ వేదికగా మద్యం కుంభకోణానికి ప్లాన్ చేసినట్లు తాజాగా సిట్ తేల్చింది. ఈరోజు కేవలం నారాయణస్వామిని సాక్షిగానే విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో ఆయన పాత్ర లేదని క్లీన్ చీట్ ఇచ్చినట్లు సమాచారం.
Also Read: కొత్త వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి!
సొంత శాఖ మంత్రి కి తెలియకుండా..
వైసిపి ( YSR Congress ) హయాంలో మంత్రులు డమ్మీలు అన్న ఆరోపణలు ఉండేవి. తమ శాఖల పట్ల కనీస అవగాహన ఉండేది కాదన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో ఓ మంత్రికి తెలియకుండా ఇంత జరిగిందా? ఇంతకీ మంత్రి ఏం చేస్తున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటివరకు మద్యం కుంభకోణం కేసులో నారాయణస్వామి పేరు వినిపించలేదు. ఇప్పుడు కేవలం ఆయనను సాక్షిగానే పిలుస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో నారాయణ స్వామికి చెప్పకుండా, చేయకుండా నిర్ణయాలు తీసుకున్నారని.. ఇప్పుడు అదే తమ నాయకుడికి సేఫ్ జోన్ అయిందని నారాయణస్వామి అనుచరులు చెబుతున్నారు. కనీసం ఒక్క రూపాయి కూడా నారాయణస్వామికి కమీషన్ అందలేదని సిట్ విచారణలో తేలినట్లు సమాచారం.
పేరుకే మంత్రి..
నారాయణస్వామి పేరుకే ఎక్సైజ్ మంత్రి( excise minister) కానీ.. ఏ రోజు ఆయన రివ్యూలు నిర్వహించలేదని తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి ముఖ్యపాత్రధారి అంటూ అప్పటి ముఖ్య నేత విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. డీల్ గురించి అనేక అంశాలను ప్రస్తావించారు. అయితే సంబంధిత మంత్రికి తెలియకుండా ఈ డీల్ జరిగినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ప్రతినెల అంతిమ లబ్ధిదారుడికి భారీగా లబ్ధి చేకూరిందని.. అప్పట్లో తలో మొత్తం నెలనెలా పంచుకునేవారని సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అయితే సంబంధిత మంత్రిగా ఉన్న నారాయణస్వామికి మాత్రం ఏ విషయం తెలియజేయకపోవడం గమనార్హం.
Also Read: ఓట్ల గోల్ మాల్: ఏపీ ఎన్నికలు రద్దు?
అప్పట్లో డమ్మీలుగా..
జగన్ ( Y S Jagan Mohan Reddy ) మంత్రివర్గంలో మంత్రులకు ఎలాంటి బాధ్యతలు ఉండేవి కావు. కనీసం తమ సొంత శాఖలపై రివ్యూలు జరిపే ఛాన్స్ కూడా ఉండేది కాదు. చివరకు మీడియా సమావేశం ఏర్పాటు చేయాలన్న పార్టీ కార్యాలయం నుంచి సమాచారం రావాల్సిందేనన్న విమర్శ ఉండేది. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణంలో సంబంధిత మంత్రి పాత్ర లేకపోవడం.. అప్పటి మంత్రివర్గం పనితీరును తెలియజేస్తోంది. ఒక శాఖలో ఇంతటి భారీ కుంభకోణం జరిగితే.. సంబంధిత మంత్రికి ఎటువంటి సంబంధము లేకపోవడం ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఇదే తొలిసారి. ఒక విధంగా చెప్పాలంటే నారాయణస్వామికి ఇది అదృష్టమే.