AP elections update: మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో( general elections ) గోల్మాల్ జరిగిందా? ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు ఉన్నాయా? బలమైన ఆధారాలతో వైసిపి ఫిర్యాదు చేసిందా? ఈసీకి త్వరలో కోర్టు ఆదేశాలు ఇవ్వనుందా? ఏపీలో ప్రభుత్వం రద్దు కానుందా? ఎన్నికలు జరుగుతాయా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. 2024లో జరిగిన ఎన్నికల్లో టిడిపి కూటమి ఏకపక్ష విజయం సాధించింది. అప్పటి అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. పేరు మోసిన నేతలు.. గెలుస్తారని నమ్మకం గా ఉన్న నాయకులు సైతం ఓడిపోయారు. అయితే ఇంతటి అపజయాన్ని ఊహించని వైసీపీ నేతలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికల్లో భారీగా గోల్మాల్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించారు.
Also Read: మద్యం కుంభకోణం.. ఈరోజు సంచలనాలు!
అభ్యంతరాలు తెలిపిన వైసిపి..
ఇటీవల ప్రత్యేక విజ్ఞప్తులు మేరకు ఎన్నికల కమిషన్( Election Commission) అధికారులు వైసిపి నేతలను ఆహ్వానించారు. తమ అభ్యంతరాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈవీఎం బ్యాటరీలు, వివి ప్యాట్ల పోలికలో వ్యత్యాసాలు, ఓటింగ్ డేటా మేనిపులేషన్ అవకాశాలపై సందేహాలు వ్యక్తం చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత అనేక నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం అసాధారణంగా పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. దాదాపు 50 లక్షల ఓట్లు ఆ సమయంలోనే పోలయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై విచారణ జరపాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరింది. కొన్ని ప్రధాన నియోజకవర్గాల్లో ఈవీఎం ఓట్లను, వివి ప్యాట్ స్లిప్పులతో 100% సరిపోల్చి చూడాలని వైసీపీ కోరింది.
Also Read: తల్లికి వందనం డబ్బులు వెనక్కి.. ప్రభుత్వం కీలక ప్రకటన!
జాతీయస్థాయిలో బీజేపీపై అనుమానాలు
మరోవైపు జాతీయ స్థాయిలో బిజెపి( Bhartiya Janata Party) వరుస విజయాలపై కూడా ప్రతిపక్షాలకు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. బిజెపి అప్రతిహస విజయాలపై సందేహాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి వైసీపీ నేతలు ఈసీని ఆశ్రయించారు. అదే సమయంలో జాతీయస్థాయిలో కొన్ని పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ తరుణంలో త్వరలో సుప్రీంకోర్టు నుంచి సంచలన తీర్పు వెళ్లడయ్యే అవకాశం ఉన్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఇప్పట్లో అది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. ఒకవేళ అనుమానాలు ఉంటే నివృత్తి చేయాలని కోర్టు ఈసీని ఆదేశించే అవకాశం ఉంది. దానిపై ఈసీ దర్యాప్తు చేసి కోర్టుకు నివేదించే అవకాశం ఉంది. కచ్చితంగా తప్పు జరిగి ఉంటే మాత్రమే ప్రభుత్వం రద్దయే అవకాశం ఉంది కానీ.. అది అంత సులువుగా జరిగే పని కాదని నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?