* రచ్చ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి ట్వీట్
Rajagopal Reddy Vs Revanth Reddy: ఎక్కడో ఏదో పత్రికలో “సీఎం గా పదేళ్లు నేనే..” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లుగా వచ్చిన వార్తకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో రచ్చ లేపుతోంది. అయితే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ లో కొంత అర్థమున్నా దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రుల పదవులు ఎవరికయ్యాలో, అధిష్టానం తుది నిర్ణయం అనే విషయం సీఎం రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి కంటే ఎక్కువ తెలుసు అందుకే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధిష్టానం అందరి అభిప్రాయాలను తీసుకొని మాత్రమే రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇచ్చారనేది నిర్వివాదాంశం. అయినా అలా మాట్లాడడం తప్పని రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేయడం వెనుక స్వప్రయోజనం ఉందని అనుకునే అవకాశముందని ప్రజలు భావిస్తారు. ప్రస్తుతం మంత్రి పదవి కావాలని ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న రాజగోపాల్ రెడ్డి మొదట ఆ పదవి దక్కించుకునేందుకు చేయాల్సిన పని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా అనిపించేలా కామెంట్స్ చేయడం వల్ల మంత్రి పదవి దక్కే అవకాశాలు కూడా జారవిడుచుకుంటున్నాడని ఆయన శ్రేయోభిలాషులే అంటున్నారు.
Also Read: ఫిష్ వెంకట్ మరణానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ యేనా..? ఎందుకు పట్టించుకోలేదు!
*పార్టీ మారడం మైనస్ పాయింటే..*
ఎన్నికలకు కొన్ని నెలల ముందు కాంగ్రెస్ పని అయిపోయిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాదని భావించి బీజేపీ లో చేరిన ఆయన బై ఎలక్షన్లలో పరాజయం పాలైన తర్వాత, ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నట్లు సర్వేలో తేలడంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నాడు. మునుగోడు నుంచి పోటీచేసి గెలిచాడు. కానీ మీడియా గన్ (ఛానల్ మైక్) పెట్టగానే పూనకం వచ్చినట్లు, ఏం మాట్లాడుతున్నారో తెలిసో, తెలియకనో మాటలు జారడం వల్ల ఆయన రాజకీయంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
*ఇన్ని రోజులు బాగానే ఉన్నారు*
అవకాశం దొరికితే రేవంత్ రెడ్డి పై విరుచుకుపడే ఆయన ఈ మధ్య కాలంలో కొంత సంయమనం పాటిస్తున్నట్లు కనిపించింది. ఈ మధ్య మునుగోడు లో మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఆచితూచి మాట్లాడారు. తనకు ఎందుకు మంత్రి పదవి రాలేదో చెప్పుకుంటూ, ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు మంత్రి పదవి దోహదపడుతుందని అర్థం వచ్చేలా మాట్లాడడం గమనార్హం.
*ఆకస్మాత్తుగా ఏమైంది..?*
ఇన్ని రోజులు సంయమనం పాటించిన ఆయన ఒక్క ట్వీట్ తో మళ్లీ రాజకీయ రచ్చ లేపారు. ఇదే అవకాశంగా తీసుకొని సోషల్ మీడియా తమకు తోచినవిధంగా ఎవరికివారే విశ్లేషణులు చేస్తుండగా మళ్ళీ వార్తలకు ఎక్కారు. దారిన పోయే కంపను తగిలించున్నట్లు అధిష్టానం చేయాల్సిన కామెంట్స్ తాను చేసి సీఎం తో ఉన్న మంచి సంబంధాలను చెడగొట్టుకున్నాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు..
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం.
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను… pic.twitter.com/nGtGpQzgGk— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) July 19, 2025