Today 14th September 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఇందులో భాగంగా ఆదివారం కొన్ని రాశుల వారి జాతకాలు మారనున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు మనసులో ఏది అనుకుంటే అది పూర్తయ్యే అవకాశం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : గతంలో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వీటిని పరిష్కరించుకోవడానికి తోటి వారి సహాయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉన్న వ్యాపారులు లాభాలు పొందుతారు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఆదాయం పెరుగుతుంది. అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు. ఉద్యోగులు కష్టపడి పని చేస్తే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈరోజు శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. సానుకూల వాతావరణం ఉండడంతో కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులు తమ నైపుణ్యం ప్రదర్శించడం ద్వారా అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సమయంలో కాస్త ఓర్పు ఉండాలి. విద్యార్థులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగులకు ఈరోజు అనుకూలమైన ప్రయోజనాలు ఉండలు ఉన్నాయి. వీరి ఆలోచన శక్తితో కొన్ని పనులు తొందరగా పూర్తవుతాయి. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏమాత్రం మొహమాటం ఉండద్దు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. వీరికి పెద్దల మద్దతు ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఎదుటివారు విమర్శించిన వారిని పట్టించుకోకపోవడం మంచిది. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కొత్తగా పనులు చేపడతారు. ఆదాయం కోసం అన్వేషిస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది. వ్యాపారులకు అడ్డంకులు సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూరపు బంధువుల నుంచి ధన సహాయం పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఉద్యోగులు అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. కొత్తిపాటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో ఘర్షణ వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం. పెద్దల సలహాతో ఉద్యోగులు ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవిస్తారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు చెడు వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిది. అనవసరపు వివాదాల్లోకి తల దూర్చొద్దు. ఇలాంటి సమస్య ఎదురైనా ఓపికతో ఉండాలి. ఉద్యోగులు వచ్చిన అవకాశాలు వినియోగించుకోవాలి. మనసులో చెడు ఆలోచనలు వస్తే వాటికి దూరంగా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కొన్ని పనులను పూర్తి చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగులకు తోటి వారి మద్దతు ఉంటుంది. అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త ప్రణాళికలు చేపడతారు. కొత్తగా భాగస్వాములను చేర్చుకోవడంతో వ్యాపారం వృద్ధి చెందుతుంది. మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . ఈ రాశి వారు కొన్ని పనులను వాయిదా వేస్తారు. అయితే సరైన ప్రణాళికతో వాటిని పూర్తిచేసే ప్రయత్నం చేయాలి. కొన్ని విషయాల్లో వెనుకడుగు వేయడంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులు సరైన లాభాలు పొందుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . . ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి. శత్రువుల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. దూరపు బంధువుల నుంచి ఆర్థిక పరమైన ఒత్తిడి కలుగుతారు. అప్పులు ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటారు.