Teja Sajja And Rajamouli: తెలుగు సినిమా దర్శకధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి… ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తుండడం విశేషం… ఇక తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్న ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో ప్రపంచ ప్రేక్షకులను తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసిన తేజ సజ్జ ప్రస్తుతం స్టార్ హీరోగా అవతరించాడు. హనుమాన్, మిరాయి లాంటి సినిమాలతో తనను తాను చాలా గొప్పగా ఎలివేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట కూడా ఆయన చేయబోతున్న సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలు ఎలాంటి గుర్తింపు సంపాదించి పెడతాయి. తద్వారా ప్రేక్షకులందరిని మెప్పించగలిగే కెపాసిటి తనకి ఉందా ఇక రాబోయే రోజుల్లో స్టార్ హీరోగా అవతరిస్తాడా?
లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికి తేజ సజ్జ ఇండస్ట్రీలో సర్వైవల్ అవ్వడానికైనా ముఖ్య కారణం రాజమౌళి అనే చెబుతున్నారు. ఎందుకంటే రాజమౌళి వల్లే తను ఇండస్ట్రీకి వచ్చాడని, హీరోగా మారడని స్టార్ హీరోగా మారడానికి కూడా రాజమౌళి నే కారణం అంటూ మరి కొంతమంది చెబుతుండటం విశేషం…
రాజమౌళి బ్యాక్ ఎండ్ నుంచి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరూ రాజమౌళికి తేజ వరుసకి తమ్ముడు అవుతారనే వార్తలు కూడా వస్తున్నాయి…ఇక మీదట కూడా రాజమౌళి తనకు సపోర్టుగా ఉంటాడని చాలా మంది చెబుతున్నారు.
మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరు రిలేషన్స్ అవ్వడం వల్లే తేజ సజ్జ చాలావరకు ముందుకు దూసుకెళుతున్నాడని మరికొందరు చెబుతుండటం విశేషం…ఎక్కడ కూడా తేజ సజ్జ సపోర్ట్ చేసినట్టుగా కనిపించినప్పటికి బ్యాక్ ఎండ్ నుంచి మాత్రం చాలా వరకు అతనికి సపోర్ట్ అయితే ఇస్తుంటాడట…