Somu Veerraju And GVL: ఏపీ మీడియాలో ఎల్లో మీడియా తీరే వేరు. వారికి టిడిపి, చంద్రబాబు ప్రయోజనాలు తప్ప మరేవి కనిపించవు. వినిపించవు కూడా. అవసరమైతే చంద్రబాబు కోసం ఎంత దాకైనా తెగించే తత్వం వారిది. గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు బిజెపి కోసం చేయని ప్రయత్నం లేదు. కానీ ఆ ప్రయత్నాలను కొందరు నాయకులు అడ్డుకుంటూ వచ్చారు. అందులో ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు ఒకరు. అటు రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహం సైతం టిడిపి తో బిజెపి పొత్తును బాహటంగా వ్యతిరేకించేవారు. దీంతో ఎల్లో మీడియాకు వీరు వైసిపి అనుకూలురుగా కనిపించారు. అందుకే ఆంధ్రజ్యోతి ఈ ఇద్దరి విషయంలో నిషేధం విధించింది.
తాజాగా చిలకలూరిపేట సభలో బిజెపి తరఫున మీరు కూడా పాల్గొన్నారు. కానీ వీరి పేర్లు కానీ.. వీరి ప్రసంగాలను గానీ ఆంధ్రజ్యోతి ప్రచురించలేదు. పురందేశ్వరి, సీఎం రమేష్, సత్య కుమార్, బొమ్మిడి నాయకర్, గాది వెంకటేశ్వరరావు, నక్క ఆనంద్ బాబు లాంటి నేతల ప్రసంగాలను ప్రచురించిన ఆంధ్రజ్యోతి సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహం లాంటి నేతలను విస్మరించింది. అయితే గతంలో టిడిపితో బీజేపీ పొత్తును వ్యతిరేకించారు కనుక నిషేధం విధించిందన్నది వాస్తవం. కానీ ఇప్పుడు పొత్తు కుదిరిన తర్వాత కూడా వీరిపై నిషేధం కొనసాగిస్తుండడం గమనించాల్సిన విషయం.
అయితే ఈ ఇద్దరు నేతలు చంద్రబాబు వైఖరిని వ్యతిరేకించడమే వీరు చేసుకున్న పాపం. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన సోము వీర్రాజు వైసిపి పై విమర్శలు చేసే క్రమంలో.. గతంలో చంద్రబాబు తప్పిదాలను సైతం ప్రస్తావించేవారు. బిజెపిని దారుణంగా దెబ్బ కొట్టిన చంద్రబాబుతో ఎన్నడు కలవబోమని కూడా తేల్చి చెప్పేవారు. ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు మింగుడు పడని విషయం. అందుకే వీరి వార్తలను తొక్కిపెట్టేవారు. వీరిని నిషేధ జాబితాలో ఉంచేవారు. నిన్న జరిగిన సభలో బిజెపి రాష్ట్ర నాయకుల్లో సీనియారిటీ ఉన్నా.. జూనియర్ గా ఉన్న బొమ్మిడి నాయకర్, గాది వెంకటేశ్వరరావు లాంటి ప్రో టిడిపి నాయకులకే రాధాకృష్ణ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విషయంలో ఈనాడు కొంత మెరుగైన రీతిలో ఆలోచించింది. బిజెపిలో అందరి నేతలకు సమ ప్రాధాన్యం ఇచ్చింది. రాధాకృష్ణ మాత్రం తన నిషేధాజ్ఞలను కొనసాగిస్తుండడం గమనార్హం.