Amravati capital : అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం పై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని చూస్తోంది. ఇందుకుగాను భారీగా నిధులు సమీకరిస్తోంది. అటు కేంద్రం సైతం అమరావతి రాజధాని నిర్మాణానికి సాయం చేస్తోంది. బడ్జెట్లో ఏకంగా 15 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రపంచ బ్యాంకు తోపాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నిధులు సర్దుబాటు చేసింది. అందుకు సంబంధించి మొదటి విడత నిధులు విడుదలయ్యాయి కూడా. ఈ తరుణంలో వచ్చే నెలలో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పనులను ప్రారంభించనుంది.
Also Read : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు To let బోర్డు!
* శరవేగంగా పనులు
అయితే ప్రపంచంలో( world) తలమానికంగా అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా అమరావతికి గ్రాండ్ ఎంట్రన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ- హైదరాబాద్ మార్గంలో ఈ ఎంట్రన్స్ ఉండేలా ప్లాన్ చేస్తోంది. దీనికోసం మూలపాడు నుంచి అమరావతి వరకు గ్రాండ్ ఎంట్రన్స్ వే నిర్మించనున్నారు. కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జిని కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు కొత్త ప్రణాళికలను రూపొందించారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణ పనులను నిపుణులు పరిశీలించారు. పునర్నిర్మాణ పనులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
* భారీ ఎంట్రన్స్ వే
విజయవాడ- హైదరాబాద్ మార్గంలో మూలపాడు ( malapadu )నుంచి అమరావతికి గ్రాండ్ ఎంట్రన్స్ వే నిర్మించాలని ప్లాన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గతంలో ఇబ్రహీంపట్నం దగ్గరలోని పవిత్ర సంగమం దగ్గర ఐకానిక్ బ్రిడ్జి కోసం భూమి పూజ చేశారు. దీనికి నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 30 లను కనెక్ట్ చేయాలని భావించారు. 2016లో ఈ ప్రతిపాదన చేసిన సమయంలో విజయవాడ వెస్ట్ బైపాస్ లేదు. అటు తరువాత గొల్లపూడి నుంచి సూరయ్యపాలెం మీదుగా కృష్ణానదిపై 3 కిలోమీటర్ల పొడవునా విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మించారు. ఇది అమరావతి రాజధానిలో వెంకట పాలెం మీదుగా తాజా వరకు వెళ్తుంది.
* రాజధాని లోని అన్ని ప్రాంతాలకు అనుసంధానం
మూలపాడు నుంచి కృష్ణానది( Krishna river) మీదుగా రాయపూడి వరకు 5.2 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తారు. అమరావతి రాజధానిలో శాఖమూరు నుండి రాయపూడి వరకు నేషనల్ హైవే 13ను నిర్మిస్తారు. దీంతో రాజధాని లోని అన్ని ప్రాంతాలకు అనుసంధానం చేసినట్టు అవుతుంది. అమరావతి గ్రాండ్ ఎంట్రన్స్ మార్గంలో కృష్ణానదిపై నాలుగు కిలోమీటర్ల మేరకు ఐకానిక్ బ్రిడ్జి ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ తయారు చేయడానికి టెండర్లు పిలిచారు అధికారులు. మూలపాడు దగ్గర నేషనల్ హైవే 65 కు అనుసంధానం చేయడం ద్వారా.. హైదరాబాద్ రూట్ లో ఈ మార్గం గేట్ వేగా మారనుంది.
Also Read : పోసాని కఠిన నిర్ణయం.. ఇక కూటమికి చెడుగుడే!