Homeక్రీడలుSun Risers Hyderabad : SRH ఆంధ్రా కు తరలిపోనుందా?

Sun Risers Hyderabad : SRH ఆంధ్రా కు తరలిపోనుందా?

Sun Risers Hyderabad : ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య కాంప్లిమెంటరీ పాస్ ల కేటాయింపు విషయంలో వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు ఉప్పల్ స్టేడియంలో ఓ గ్యాలరీకి తాళం వేశారని.. దానివల్ల తాము తీవ్రంగా ఇబ్బంది పడ్డామని సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఒక మెయిల్ కూడా చేసింది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రావడంతో.. ఆయన వెంటనే తెలంగాణ విజిలెన్స్ పోలీసులను రంగంలోకి దింపారు.. విజిలెన్స్ పోలీసులు విచారణ మొదలు పెట్టగానే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దిగివచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం చెప్పినట్టు వింటామని ప్రకటించింది. దీంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను కూడా పక్కదారి పట్టించాలని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో జగన్మోహన్రావు వ్యవహార శైలి కూడా ఆరోపణలకు తాబు ఇచ్చే విధంగా ఉంది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించింది.. ఈ సీజన్లో మిగతా మ్యాచ్లు మొత్తం విశాఖపట్నంలో నిర్వహించాలని కోరింది.. పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని ప్రకటించింది. ఇటీవల కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో హైదరాబాద్ జట్టు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య వివాదం ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజిలెన్స్ పోలీసులను విచారణకు ఆదేశించడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దిగివచ్చింది. ఇక ఈ సీజన్లో విశాఖపట్నంలో రెండు ఐపిఎల్ మ్యాచ్ లు జరిగిన సంగతి తెలిసిందే.

Also Read : కోల్ కతా పై గెలిస్తేనే.. పరువు దక్కేది..SRH ఏం చేస్తుందో?

సన్ రైజర్స్ వెళ్తుందా

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్ ప్రకటించిన నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆంధ్ర వెళ్తుందా అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఇక ఇటీవల ఏపీలోని కొంతమంది రాజకీయ నాయకులు ఐపీఎల్లో కూడా ఆంధ్రప్రదేశ్ జట్టు ఉండేలాగా చూస్తామని ప్రకటించారు. అది అంత సులభం కాకపోయినప్పటికీ.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమే జట్టుగా ఉంది. 2013లో దక్కన్ చార్జర్స్ జట్టును సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సొంతం చేసుకుంది. 2016 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తో వివాదం నెలకొన్న నేపథ్యంలో..సన్ రైజర్స్ హైదరాబాద్ ఆంధ్రకు తరలిపోతుందా? అనే ప్రశ్నకు సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు. సన్ రైజర్స్ జట్టు పేరు లో హైదరాబాద్ ఉంది కాబట్టి ఆంధ్రకు తరలిపోయే అవకాశం లేదని తెలుస్తోంది.. మరోవైపు హైదరాబాద్ జట్టు ఆంధ్రకు తరలిపోతే.. అభిమానులు రెండు వర్గాలుగా విడిపోతారని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పటికే చెప్పినట్టు వింటామని తల ఊపడంతో.. హైదరాబాద్ జట్టు ఆంధ్రకు తరలిపోయే అవకాశం లేదని తెలుస్తోంది.

Also Read : రేవంత్ రెడ్డి దెబ్బకు దిగొచ్చిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular