Amravati capital : ఏపీ రాజకీయాల్లో( AP politics) కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ మే నెల 2న శంకుస్థాపన చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా చేస్తోంది. మరోవైపు ప్రధాని బహిరంగ సభ కోసం భారీగా జన సమీకరణ చేస్తున్నారు. అమరావతి రైతులకు బొట్టుపెట్టి ఆహ్వానిస్తున్నారు. అయితే ఈ ఆహ్వాన పత్రికలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పేరు మాత్రమే ఉండడం వివాదంగా మారుతోంది. పవన్ పేరు ఎందుకు లేదని జనసైనికులు నిలదీస్తున్నారు. మరోవైపు ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రచార అస్త్రంగా మారుతోంది. ఓ మాజీ మంత్రి సెటైరికల్ పోస్టు ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.
* పవన్ పేరు లేకపోవడంపై చర్చ..
అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనులకు సంబంధించిన ఆహ్వాన పత్రికలో పవన్ పేరు లేకపోవడం ఇప్పుడు వివాదంగా మారుతోంది. జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ను కూరలో కరివేపాకులా పక్కన పెట్టారని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. జనసేన పార్టీని ట్యాగ్ చేసి పవన్ పేరు లేకపోవడంపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. తాము కూటమిలో విధేయులుగా ఉంటున్నామని.. బానిసలం కాదని పోస్టింగ్స్ చేస్తున్నారు. కూటమిగా మూడు పార్టీలను కలపడం.. అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ను ఎలా విస్మరిస్తారని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు. అమరావతి విషయంలో ఎన్నికల ముందు నుంచే పవన్ మద్దతుగా నిలుస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
Also Read : ఏపీకి అమరావతి భవిత.. ప్రత్యేక డిజైన్లు ఆహ్వాన పత్రిక!
* ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు..
అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి శంకుస్థాపనకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుక కోసం భారీగా ఆహ్వానాలు పంపుతున్నారు. ప్రత్యేక ఆహ్వాన పత్రికలను రూపొందించారు. వాటిని అందంగా డిజైన్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో( social media) వైరల్ అవుతున్నాయి. ఈ ఆహ్వాన పత్రికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్లు, అమరావతి స్తూపం చిత్రాలు మాత్రమే ఉన్నాయి. అలాగే నగర నిర్మాణాన్ని ప్రతిబింబించే ఊహ చిత్రాలు ఈ పత్రికలో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఈ ఆహ్వాన పత్రిక రూపకల్పన.. పంపిణీ బాధ్యతలను ప్రభుత్వమే పర్యవేక్షిస్తోంది. అటువంటి ఆహ్వాన పత్రికలో కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంపై జనసైనికులు మండిపడుతున్నారు.
* పేర్ని నాని సెటైరికల్ కామెంట్స్..
మరోవైపు ఈ ఆహ్వాన పత్రిక పై మాజీ మంత్రి పేర్ని నాని( perni Nani ) సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇక్కడ ఎవరి పేరో మిస్ అయ్యిందంటూ సెటైరికల్ పోస్ట్ పెట్టారు. కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు పేర్లు మాత్రమే చూపేలా పోస్ట్ చేశారు. తేనె తుట్టను కదిపినట్లు అయ్యింది. అయితే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమరావతి పునర్నిర్మాణ పనుల విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంప్రదించకుండా.. ఆహ్వాన పత్రిక ముద్రించే అవకాశం లేదని కూటమి వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.