Kingdom Movie : వరుస డిజాస్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) వచ్చే నెల 30వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కొంతకాలం క్రితమే విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ సరైన కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు, కచ్చితంగా ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకాన్ని కలిగించింది ఈ సినిమా టీజర్. అయితే సినిమా విడుదల నెల లోకి అడుగుపెడుతున్న ఈ నేపథ్యం లో మేకర్స్ ప్రొమోషన్స్ ని మొదలు పెట్టేసారు. నేడు ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట ‘హృదయం లోపల’ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు.
Also Read : సెన్సేషనల్ డైరెక్టర్ తో వెంకటేష్ కొత్త సినిమా ఫిక్స్..మరో 300 కోట్ల గ్రాస్ గ్యారంటీ!
సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ ఈ చిత్రానికి పాటలు అందించాడు. నేడు విడుదల చేసిన 59 సెకండ్ల ప్రోమో లో విజయ్ దేవరకొండ మార్క్ గట్టిగా కనిపించింది. ఆయన సినిమా అంటే కచ్చితంగా లిప్ లాక్ సన్నివేశం ఉండాల్సిందే. ఈ పాటలో అయితే కేవలం లిప్ లాక్ మాత్రమే కాదు, ఆ తర్వాత చేసే సన్నివేశాలు కూడా ఉన్నట్టు ఉన్నాయి. కేవలం ఇంత చిన్న ప్రోమో లోనే ఈ రేంజ్ విద్వంసం సృష్టిస్తే, ఇక ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ లో ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ని మే 2న విడుదల చేయబోతున్నారు. మెలోడీ సాంగ్స్ ని అద్భుతంగా ఇవ్వడం లో అనిరుద్ సిద్ధహస్తుడు. ఈ పాట క్లిక్ అయితే కచ్చితంగా ఆడియన్స్ లో ఈ సినిమా పై మంచి క్రేజ్ ఏర్పడుతుంది.
ఇకపోతే ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి(Gowtham tinnanuri) దర్శకత్వం వహిస్తుండగా, భాగ్యశ్రీ భోర్సే(Bhagyasri Bhorse), మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ముందుగా భాగ్యశ్రీ బదులుగా శ్రీలీల ని తీసుకున్నారు. కానీ ఆమె ఈ చిత్రం నుండి తప్పుకుంది. అప్పట్లో ఎందుకు తప్పుకుందో తెలియదు కానీ, నేడు విడుదలైన పాటని చూసిన తర్వాత అసలు విషయం అర్థమైంది. ఆమె లిప్ లాక్ సన్నివేశాలకు నో చెప్పిన సంగతి తెలిసిందే. నా మొదటి ముద్దు నా భర్తకు మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. ఈరోజు విడుదలైన ప్రోమో సాంగ్ లో భాగ్యశ్రీ లిప్ లాక్ సన్నివేశాల్లో ఎలా నటించిందో మనమంతా చూసాము. ఆ తర్వాత కూడా కాస్త బోల్డ్ సన్నివేశాలు ఈ చిత్రం లో పుష్కలంగా ఉన్నట్టు ఉన్నాయి, అందుకే ఆమె ఈ చిత్రం నుండి తప్పుకుంది కావొచ్చు. ఇకపోతే వరుస విజయాలతో దూసుకుపోతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.