Amravati Capital : అమరావతి రాజధాని ( Amravati capital ) విషయంలో ఏపీ ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో ముందుకు వెళ్తోంది. ఒకవైపు రాష్ట్ర పాలనను సాగిస్తూనే అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది. ఈ నెల చివర్లో అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆర్థిక వనరుల సమీకరణపై ఫుల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా తన వంతు సాయం అందిస్తూ వస్తోంది. గత రెండుసార్లు లేని విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి అమరావతి రాజధాని కి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడమే అందుకు కారణం.
Also Read : జగన్ కు ముద్రగడ లేఖ.. జీర్ణించుకోలేకపోతున్న కాపు సామాజిక వర్గం!
* రెండో విడత భూ సమీకరణ
అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు( CM Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. అమరావతి కోసం రెండో విడత భూ సమీకరణకు సిద్ధమయ్యారు. 43 వేల ఎకరాల సమీకరణ ద్వారా అమరావతి భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తద్వారా అమరావతి పరిధిని పెంచేందుకు కూడా యోచిస్తున్నారు. కొత్తగా మరో 44 వేల ఎకరాల భూములను సమీకరణ కింద తీసుకునేందుకు సిఆర్డిఏ ప్రతిపాదనలు రూపొందించింది. అమరావతిలో 92 ప్రాజెక్టులను గుర్తించి.. రూ. 65 వేలకోట్ల అంచనా వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. ఇంకా కొన్ని కీలక ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రెసిడెన్షియల్, గ్రూప్ హౌస్ లు, హై రైజ్ భవనాలు, కమర్షియల్ భవనాలను అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. అదనంగా 44 వేల ఎకరాలు సమీకరించడానికి కారణం ఇవేనని తెలుస్తోంది. ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి దాదాపు ఐదు నుంచి ఏడు వేల ఎకరాల భూమి అవసరం.
* సుందర రహదారులు..
అమరావతికి రాజమార్గాలు నిర్మించాలన్నది ప్లాన్. జాతీయ రహదారిని( National Highway) అనుసంధానిస్తూ ఈ రాజమార్గాల నిర్మాణం జరగనుంది. మరోవైపు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులకు అనుసంధానంగా అమరావతి రోడ్లను లింక్ చేయాలి. అమరావతిలో ఇప్పుడు కోట్ల రూపాయల్లో భూముల ధర ఉంది. అందుకే ఇక్కడ భూసేకరణ అసాధ్యం. అందుకే భూ సమీకరణకు సిద్ధపడుతోంది ప్రభుత్వం. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరైన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో మరింత నిధులు ఇచ్చేందుకు కూడా ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉంది. అయితే అమరావతి రాజధానికి మరింత భూములు సమీకరించాలన్నది ప్రపంచ బ్యాంకు సూచనగా తెలుస్తోంది. అందుకే రాజధాని విస్తరణకు మరో 44 వేల ఎకరాలను సమీకరించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. అయితే సమీకరించాలన్న భూమికి సంబంధించి సిఆర్డిఏ ఒక నివేదిక కూడా సిద్ధం చేసింది.
* నవ నగరాలు నిర్మించాలన్నది ప్లాన్
అమరావతి రాజధాని లో నవ నగరాలు( nine cities ) నిర్మించాలన్నది లక్ష్యం. తుళ్లూరు, అమరావతి, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలో మొత్తం 11 గ్రామాల్లో 18 వేలకు పైగా హెక్టార్ల భూములను తీసుకోవాలని భావిస్తున్నారు. అయితే గతంలో భూముల సమీకరణలో చంద్రబాబు విజయవంతం అయ్యారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాతో వెళ్తుండడంతో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకెళ్తోంది.
Also Read : గాల్లో తేలిపోవాలని ఉందా.. ఏపీలో త్వరలో ఐదు చోట్ల రోప్ వేలు!