Hit 3 Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నాని లాంటి నటుడికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలకు ఇండస్ట్రీ లో భారీ రెస్పాన్స్ రావడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకున్నాడు…ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి…ఇక ప్రస్తుతం ఆయన శైలేష్ కోలన్ దర్శకత్వం లో హిట్ ప్రాంచైజ్ లో భాగంగా ‘హిట్ 3’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మే 1 వ తేదీన రిలీజ్ అవుతున్న నేపధ్యంలో కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు…ఈ సినిమా లో ఆయన అర్జున్ సర్కార్ అనే ఒక సైకో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు…
Also Read: మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆ దర్శకుడితో సినిమా చేయాలనుకున్నారా..?
తనకి అడ్డు ఏది లేదు అతన్ని అదుపు చేసే వాడు లేడు అనే రేంజ్ లో ఈ సినిమాలో తన నటన ఉండబోతుంది…తన లాటి కి బలై పోయే వాళ్ళు ఎవరు అనేది తెలియాల్సి ఉంది…ఇక ఈ సినిమాలో రౌడీ నా కొడుకులు ఉంటే జైలు లో ఉండాలి లేకపోతే భూమిలో శవాల్లా ఉండాలి అనే ఒక పాయింట్ ను తీసుకొని ఆయన ముందుకు సాగుతాడు…
ఒక పిల్లాడి మిస్సింగ్ ఒక కేసు ను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అర్జున్ సర్కార్ ఆ కేసు కోసం ఎంత దూరమైన వెళ్తాడు ఎవరితో అయిన పోటీ పెట్టుకుంటాడు… ఎంత మందిని అయిన సరే ఎదురిస్తాడు మరి అలాంటి పాత్ర తో ముందుకు వస్తున్న నాని ఈ సినిమాతో మరో సక్సెస్ ను సాధించడానికి సిద్ధం అవుతున్నాడు…ఇక ఈ ట్రైలర్ లో తన క్యారెక్టర్ ను హైలెట్ చేస్తూనే ఒక కేసు కోసం ఆయన ఎలా పోరాటం చేస్తాడో చూపించారు. అలాగే విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి…ఇక ఎక్కువగా వయోలెన్స్ ఉంది…ఇదంతా చూస్తుంటే నాని వయోలెన్స్ లో పీ హెచ్డి చేశాడా అనేలా ఈ ట్రైలర్ ఉంది…
నాని రక్తపు మరకలతో కనిపించడం నిజంగా రోమాలు నిక్కబొడుచుకునే సన్నివేశాలనే చెప్పాలి…దర్శకుడు సైతం నాని లోని కంప్లీట్ మాస్ స్టఫ్ ను బయటికి తీసే ప్రయత్నం అయితే చేశారు…ఇక ఈ ట్రైలర్ చివర్లో నాని చేసే ఫైటింగ్ సీన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి…