Amravati capital : అమరావతి రాజధాని( Amravati capital ) పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఐదు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. ప్రధానంగా గత రెండు రోజులుగా మీడియా దృష్టి అంతా అమరావతిపై ఉంది. ఏపీ కలల రాజధాని పనులు ప్రారంభోత్సవం కావడంతో.. అన్ని వర్గాల ప్రజలు ఆహ్వానించారు. మరోవైపు ప్రముఖ సంస్థలు, వ్యాపారవేత్తలు అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను ఆహ్వానిస్తూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. కానీ ఏపీలో మాత్రం ఒక్క సాక్షి మీడియా తప్ప.. చిన్నాచితకా మీడియాలో సైతం విపరీతంగా యాడ్లు వచ్చాయి. సాక్షిలో ఒక్కటంటే ఒక్కటి అమరావతి రాజధానిని ఆహ్వానిస్తూ యాడ్ కనిపించలేదు.
Also Read : అమరావతికి ప్రధాని భరోసా.. ఆ విమర్శలకు చెక్!
* నాడు రాజశేఖర్ రెడ్డి హయాంలో..
తెలుగు నాట తమకంటూ ఒక మీడియా ఉండాలని భావించారు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ). అందుకే కుమారుడు జగన్మోహన్ రెడ్డితో ఇందిరా మీడియా పేరుతో సాక్షి ఛానల్, పత్రికను ఏర్పాటు చేశారు. అయితే ఈ మీడియా రాజశేఖర్ రెడ్డి కి ఎటువంటి మైలేజ్ ఇవ్వలేదు కానీ.. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా కలిసి వచ్చేలా సాక్షి గట్టిగానే పనిచేసింది. అయితే జనాదరణలో మాత్రం పెద్దగా స్పందన లేదు. వైయస్సార్ కాంగ్రెస్ అధికారం కోల్పోయాక సాక్షి సర్కులేషన్ పడిపోయింది. అదే సమయంలో యాడ్ రెవెన్యూ కూడా తగ్గింది. దీంతో ఆ మీడియా ఆదాయం పెంచుకునేందుకు రిపోర్టర్లకు పై ఒత్తిడి ప్రారంభించింది.
* ఆసక్తి చూపని ప్రముఖులు..
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం పెద్ద ఈవెంట్. వ్యాపారులతో పాటు ప్రముఖులు మీడియాకు ప్రకటనలు ఇచ్చారు. ఈ క్రమంలో సాక్షి యాడ్స్ టీం( Sakshi adds team ) ప్రముఖులను ఆశ్రయించింది. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా మెత్తబడలేదు. అమరావతి పై విషం నింపిన సాక్షికి యాడ్లు ఇచ్చేందుకు వెనుకడుగు వేశారు. పైగా సాక్షికి యాడ్లు ఇస్తే కూటమి పార్టీలకు కోపం వస్తుందని ఎక్కువ మందికి తెలుసు. ఆపై అమరావతిపై విషం చిమ్మడంలో సాక్షి ముందుండేది. దీంతో తమ వ్యాపార కార్యకలాపాలు అమరావతిలో మందగిస్తాయని చాలామంది భయపడ్డారు. అందుకే సాక్షి యాడ్స్ టీం ప్రలోభాలకు లొంగలేదు. అందుకే మిగతా పత్రికలు ప్రకటనలతో నిండిపోగా.. సాక్షి పత్రిక మాత్రం వెలవెల పోయింది.
* వైసీపీ హయాంలో ఎనలేని ప్రాధాన్యం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో సాక్షి మీడియాకు ఎనలేని ప్రాధాన్యం దక్కింది. అన్ని పత్రికలకు మించి యాడ్ల రూపంలో ఆదాయం సమకూరింది. ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో ఓన్లీ ప్రకటనల రూపంలో సాక్షికి 500 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు అధికారం కోల్పోవడంతో యాడ్లు తగ్గాయి. సర్క్యులేషన్ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేక మీడియాకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యాడ్లు ఇవ్వలేదు. ఇప్పుడు టిడిపి ప్రభుత్వం నుంచి సాక్షికి అదే పరిస్థితి ఎదురవ్వడంతో.. ఆ పత్రిక మనుగడ ప్రశ్నార్ధకం అవుతోంది.